చిట్లిన శిరోజాలకు చక్కని పోషణ

చివర్లు చిట్లిన శిరోజాలు చాలామందిని వేధించే సమస్య. దీన్ని నివారించాలంటే... కత్తిరించడమే కాదు.. అదనంగా చేయాల్సిన చికిత్సలూ కొన్ని ఉన్నాయి.

చెంచా కొబ్బరినూనెలో చెంచా నిమ్మరసం, కొద్దిగా ముల్తానీమట్టి చేర్చి తలకు పూతలా వేయాలి. గంటాగి తలస్నానం చేయాలి. శిరోజాలు చిట్లకుండా చేస్తుందీ ప్యాక్‌. అలాగే.. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. ఆ తరవాత కండిషనింగ్‌ కూడా తప్పనిసరి. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే వారానికోసారి తలకు నూనె రాసి మర్దన చేసి.. వేడినీటిలో ముంచిన టవల్‌ను చుట్టాలి.

కురులు మరీ చిట్లినట్లు ఉంటే.. వేడినీటితో తలస్నానం చేయకూడదు. దీనివల్ల సమస్య మరింత పెరుగుతుంది. జుట్టూ పొడిబారుతుంది. నాలుగుచుక్కల అల్లంరసంలో కొద్దిగా ఆలివ్‌నూనె చేర్చి జుట్టు కుదళ్లకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. కుదుళ్లు దృఢమవుతాయి. అదేపనిగా తలను దువ్వడం వల్ల కూడా చివర్లు చిట్లుతాయని తెలుసుకోండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top