జీర్ణశక్తికి ఉపయోగపడే యోగ ఆసనాలు

ఏంతినాలన్నా భయం? తింటే ఏమవుతుందో.. అరుగుతుందో అరగదో? త్రేన్పులు.. కడుపు మంట ఈ ఇబ్బందులు పడేవారికి యోగాలో చక్కని మార్గాలు ఉన్నాయి. 
                                వజ్రాసనం


ఇంద్రుడి వజ్రాయుధం ఎంత శక్తిమంతమైందో ఆ ఆసనం కూడా అంత శక్తిమంతమైనది. ఒక మొత్తటి చాప మీద రెండు కాళ్లు వెనక్కి మడిచి కూర్చోవాలి. రెండు చేతులని రెండు మోకాళ్ల మీద ఉంచి వెన్నెముక నిటారుగా ఉంచాలి. కళ్లు మూసుకొని ధ్యాస అంతా జీర్ణాశయం మీద ఉంచాలి. ఇలా ఐదు నిమిషాలు కూర్చోవాలి. జీర్ణాశయ సమస్యలతో అంటే అరుగుదల లేకపోవడం, గ్యాస్‌, కడుపులో మంట, త్రేన్పులు వంటి సమస్యలకు ఈ ఆసనం చక్కని పరిష్కారం. భోంచేసిన తర్వాత వజ్రాసనంలో ఐదు నిమిషాలు కూర్చుంటే చక్కని ఫలితం అందుతుంది. 

సాధారణంగా యోగాసనాలు ఖాళీ కడుపుతోనే చెయ్యాలి. ఈ ఒక్క ఆసనం మాత్రం తిన్న తర్వాత వేయొచ్చు.   
                          ఉడ్డియాన బంధ


ఉడ్డియాన అంటే పొట్ట. బంధ అంటే బంధించడం. త్రిబంధాల్లో ఇదెంతో ముఖ్యమైంది. ఇది జీర్ణాశయ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. కొవ్వు తగ్గించడంలో సాయపడుతుంది. పొట్ట దగ్గర కొవ్వు పెరగకుండా చూస్తుంది.జీర్ణాశయానికి విశ్రాంతి లభిస్తుంది. వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ నిలబడి కొంచెం ముందుకు వంగి కూడా ఈ బంధం చేయొచ్చు. వజ్రాసనంలో కూర్చొని రెండు చేతులు మోకాళ్ల మీద ఉంచాలి. బాగా దీర్ఘంగా గాలిని లోపలకు ముక్కుతో తీసుకొని మొత్తం గాలిని నెమ్మదిగా బయటికి వదిలేయాలి.
గాలిని బయటకు వదిలి అలాగే ఉండి పొట్టను లోపలకు లాగి ఉంచాలి. గాలిని తీసుకోకూడదు. వదలకూడదు. అలా ఎంత సేపు ఉండగలుగుతారో అంత సేపు ఉండి తర్వాత గాలిని తీసుకొంటూ రిలాక్స్‌ అవ్వాలి. ఇలా నాలుగు సార్లు చెయ్యాలి. మీరు రెండు నిమిషాలు ఉండి ఒక్కసారి చేస్తే చాలు.
అల్సర్‌ ఉన్న వాళ్లు ఈ బంధం చెయ్యకూడదు.  
                          ఉదరాకర్షణాసనం


ఉదరం అంటే పొట్ట. ఈ ఆసనం వేసేటప్పుడు మోకాలితో పొట్టని వత్తిపెట్టి చేస్తాం కాబట్టి ఉదరాకర్షణాసనం అని అంటారు. రెండు కాళ్లు కొంచెం దూరంగా పెట్టి కూర్చోవాలి. రెండు చేతులు రెండు మోకాళ్ల మీదా పెట్టి ముందుగా ఎడమ మెకాలిని క్రింద ఉంచాలి. కుడిమోకాలిని పొట్టవైపు వత్తి ఉంచి.. ఎడమవైపునకు ఉంచి గాలిని వదిలేస్తూ తిరిగి చూడాలి. గాలిని తీసుకొంటూ సమస్థితికి రావాలి. ఇలా ఎడమ వైపు ఒకసారి కుడివైపునకి ఒకసారి మార్చిమార్చి పది నుంచి ఇరవై సార్లు చెయ్యాలి.  

మోకాలి నొప్పులు అధికంగా ఉండేవారు ఈ రకం ఆసనాలు వెయ్యకూడదు.
              అనులోమ విలోమ ప్రాణాయామం


సుఖాసనంలో కూర్చొని ఎడమ చెయ్యి ఎడమ మోకాలు మీద చిన్‌ముద్ర
(బొటన వేలు, చూపుడు వేలును కలిపి మిగిలిన వేళ్లను నిటారుగా ఉంచాలి)లో ఉంచి కుడి చెయ్యి నాసికాముద్రలో అంటే చూపుడు వేలు మధ్యవేలు మడిచి చిటికెన వేలు, ఉంగరం వేలు నిటారుగా ఉంచాలి. ముందుగా కుడిముక్కు మూసి ఎడమ ముక్కుతో గాలిని తీసుకొని కుడిముక్కుతో గాలిని వదిలి మరల అదే ముక్కుతో గాలి తీసుకొని ఎడమ ముక్కు నుంచి వదలాలి. ఇది ఒక రౌండు అంటారు. ఇలా ఐదు నుంచి పది నిమిషాలు  చెయ్యాలి.
  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top