బాడీలాంగ్వేజ్‌ను బట్టి మనుషుల్ని అంచనా వేయడం ఎలా ?

భాషకి ఎంతటి ప్రాముఖ్యత ఉందో అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత శరీర భాషకు ఉంది. శరీర భాష అంటే బాడీలాంగ్వేజ్. బాడీలాంగ్వేజ్‌ను బట్టి మనుషుల్ని అంచనా వేయడం ఎంతో సులభం. ఈ విషయం గురించి అవగాహన కలిగి ఉండడం ఎంతైనా శ్రేయస్కరం.
  • మాట్లాడేటప్పుడు చేతితో పదేపదే ముక్కు గీరుకుంటుంటే కనుక నిజాలు మాట్లాడడం లేదని అర్థం. ఎందుకంటే అబద్ధం చెప్తున్న నోటిని కనపడకుండా ఉంచేందుకు నోటిని చేతితో కప్పేస్తూ ముక్కు గీరుకుంటారన్నమాట.
  • కొందరు ఎక్కువగా పైవైపుకి చూస్తుంటారు. ఈ సంకేతానికి అర్థం... పై నుంచి సాయం కోరుకుంటున్నారని. అలాగే తమకి తాము ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకునే వాళ్లు కూడా ఇలాగే చూస్తుంటారు.
  • కంగారు, ఆందోళన, ఒత్తిడి ఎక్కువగా ఉన్నవాళ్లు ఎక్కువసార్లు కళ్లు ఆర్పుతుంటారు. అలాగే ఎక్కువగా ఆలోచించేవాళ్లు కూడా ఇలానే చేస్తారు.
  • కిందిపెదవిని లేదా నోటిలో ఒక చివరి భాగాన్ని పైపళ్లతో కొరుకుతుంటారు కొందరు. ఏదైనా విషయం గురించి బయటికి మాట్లాడడం ఇష్టంలేని వాళ్లే ఇలా చేస్తుంటారు.
  • తల్లి భుజం మీద పిల్లవాడు తలవాల్చినట్టుగా కొందరు తలను పక్కకి వాల్చేస్తుంటారు. ఇలా తల పెట్టినప్పుడు మెడ భాగం చక్కగా వంపు తిరిగి కనిపిస్తుంటుంది. ఈ భంగిమలో ఆడవాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇష్టమైన మగవాళ్లు ఎదురుగా ఉన్నప్పుడు ఆడవాళ్లు ఈ భంగిమలో ఉంటారు.
  • కనుబొమల్ని కిందకు వంచి... అంటే నుదురు ముడిచి చూస్తుంటారు కొందరు. ఈ భంగిమ ఎక్కువగా మగవాళ్లలో కనిపిస్తుంది. ఇలా చూడడం వెనక "నేను నిన్ను చూస్తుండొచ్చు... కాని నేను తెలివితోనే ఉన్నాన''నే భావనని వ్యక్తపరుస్తుంటారు.
  • జరుగుతున్న సంభాషణ పట్ల ఆసక్తి లేనప్పుడు.... నిల్చున్నా, కూర్చున్నా ఒక వైపు నుంచి మరొక వైపుకు బరువును మారుస్తుంటారు. అయితే మగవాళ్లు అందమైన అమ్మాయి ముందు కూర్చున్నప్పుడు తాము శక్తివంతులమని చెప్పేందుకు కూడా ఇలా చేస్తుంటారు.
  • అరచేతులు ఎదుటి వాళ్లకు కనిపించేలా ఉంచడం అనేది స్నేహపూర్వకమైన భంగిమ. ఇది ఎదుటి వాళ్ల పట్ల తమకున్న అంగీకారాన్ని తెలుపుతున్నట్టు, మంచి భావాన్ని వ్యక్తం చేస్తున్నట్టు అంతేకాకుండా కొత్త ఆలోచనలకు ఆహ్వానం పలుకుతున్నట్టు గుర్తు. ఈ భంగిమకు పూర్తి వ్యతిరేకం ఒక చేతిని మరో చేత్తో మూసేయడం. ఇది దేన్నీ మీనుంచి దూరంగా పోనీయరని, అంత తేలికగా వదలరని అర్ధం.

మొత్తం మీద శరీరంలో ప్రతీ భాగం మనిషిలోని ఆలోచనల్ని, చేయాలనుకుంటున్న పనుల్ని బయటపెడుతుంది. అందుకని నలుగురిలోకి వెళ్లినప్పుడు శరీరభాష జాగ్రత్తగా ఉండాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top