మన సెలబ్రిటీల సెంటిమెంట్లు ఏమిటో చూద్దాం

సెంటిమెంటుకు జీవితానికి విడదీయరాని బంధం. కొత్త పని మొదలెట్టే ముందు దేవుడ్ని తలుచుకుంటారు కొందరు. కొందరు ఫలానా రోజు ఫలానా రంగు డ్రెస్ మాత్రమే వేసుకుంటారు. మరికొందరు జేబులో చిన్ననాటి నేస్తం ఫోటో పెట్టుకుంటారు. ఆలా చేస్తే వారికి మంచి జరుగుతుందని నమ్మకం. సైన్స్‌కు ఇది ఎంత దగ్గర అనే విషయాన్ని పక్కన పెడితే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. మరి మీ సెంటిమెంట్ ఏమిటి? అనే విషయాన్ని ఆలోచిస్తూ మన సెలబ్రిటీల సెంటిమెంట్లు ఏమిటో చూద్దాం.

బాలీవుడ్ అందాల భామ విద్యాబాలన్ ఎప్పుడూ హష్మి బ్రాండ్ కాటుక మాత్రమే పెట్టుకుంటుంది. పాకిస్తాన్ నుంచి తెప్పించుకొనే ఆ కాటుక తనకు అదృష్టం తెచ్చిపెడుతుందని విద్య నమ్మకం.

బిగ్ బి అమితాబ్ తన తండ్రి ఉపయోగించిన గడియారాన్ని ధరిస్తారు. జ్యోతిష పండితుల సలహా మేరకు నీలం పొదిగిన ఉంగరం పెట్టుకుంటారు. అమితాబ్ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పిన కౌన్‌బనేగా కరోర్‌పతి ప్రోగ్రాం ప్రారంభానికి ముందు నీలం ధరించాల్సిందిగా జ్యోతిష పండితులు సలహా ఇచ్చారట. పైగా లేటు వయసులో అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు పచ్చ పొదిగిన ఉంగరాన్ని కూడా ధరిస్తారట అమితాబ్.

ముంబై కండల వీరుడు సల్మాన్ ఖాన్ కుడిచేతికి ఎప్పుడూ నీలం పొదిగిన బ్రాస్‌లెట్ ధరిస్తాడు. ఆ నీలం తనను ఏం చేసినా కష్టాల పాలు కాకుండా చూసుకుంటుందని సల్లూ నమ్మకం.

మన క్రికెటర్లు ఒకొక్కరికీ ఒక్కో సెంటిమెంటు. జహీర్, అజర్, గంగూలీలు క్రికెట్ ఆడే సమయంలో ఎప్పుడూ హ్యాండ్ కర్చీఫ్‌లు దగ్గర ఉంచుకుంటారట. అవి తమకు అదృష్టం తెచ్చిపెడతాయని వారి నమ్మకం. జహీర్ పసుపురంగు కర్చీఫ్ వాడితే గంగూలీ ఎర్రది, అజార్ నల్లరంగు కర్చీఫ్ వాడేవారట!

అమెరికా అధ్యక్షుడు ఒబామా నమ్మకాలు వింటే ఆశ్చర్యం కలుగక మానదు. ఆయన జేబులో నిరంతరం హనుమాన్ బొమ్మ పెట్టుకుంటారట. అలాగే బిడ్డతో ఉన్న మడొన్నా ఫొటోను, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంటున్న అమెరికా సైనికుడికి చెందిన బ్రేస్‌లెట్‌ను ఒబామా ఎప్పుడూ తన వద్ద ఉంచుకుంటారట.

సచిన్ తన సుదీర్ఘ క్రికెట్ జీవితంలో ఇప్పటి వరకు ఒక అలవాటును మాత్రం మార్చుకోలేదట. తన సోదరుడు అజిత్ బహూకరించిన ప్యాడ్ పెట్టుకోకుండా ఇంతవరకు సచిన్ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టలేదట. కుడికాలుకు కట్టుకొనే ఆ ప్యాడే సచిన్‌ను క్రికెట్ రారాజును చేసిందేమో!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top