పనీర్‌ బొబ్బట్లు


కావల్సినవి:
ఉడికించిన బంగాళా దుంపలు - నాలుగు; పనీర్‌ తురుము - అరకప్పు; పంచదార పొడి - కప్పు; జీడిపప్పు, బాదం - రెండు చెంచాల చొప్పున; నెయ్యి - బొబ్బట్లు కాల్చడానికి సరిపడా; యాలకుల పొడి - చెంచా; మైదా - రెండు కప్పులు; నూనె - కొద్దిగా.


తయారీ:  
మైదాను నీళ్లతో చపాతీపిండిలా కలిపి.. చివరగా నూనె వేసి మరోసారి కలిపి మూత పెట్టేయాలి. ఇది అరగంట నానాలి. ఇప్పుడు బాదం, జీడిపప్పుల్ని మిక్సీలో వేసి బరకగా చేసుకోవాలి. బంగాళాదుంపల్ని చిదిమి అందులో పనీర్‌ తురుము, పంచదారపొడి, జీడిపప్పు.. బాదంపొడి, యాలకులపొడి, కాస్త నెయ్యి వేసి ముద్దలా చేసుకుంటే పూర్ణం సిద్ధమైనట్లే. పూర్ణాన్ని నిమ్మకాయంత ఉండల్లా చేసుకోవాలి. నానిన మైదాను బాగా కలిపి ఉండల్లా చేసుకోవాలి. ఒక్కో ఉండను కవరుపై గుండ్రంగా అద్ది.. మధ్యలో పూర్ణం ఉంచాలి. చుట్టూ మూసి.. మరికాస్త పెద్దగా అద్ది పెనంపై వేయాలి. నేతితో రెండు వైపులా కాల్చితే చాలు.. వేడివేడి పనీర్‌ బొబ్బట్లు తయార్‌.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top