కొత్తిమీర వూరగాయ


కావల్సినవి:
కొత్తిమీర తరుగు- ఐదు కప్పులు, కారం- కప్పున్నర, మెంతులు, ఆవాలు- ఒక్కోటి పావు కప్పు కంటే తక్కువ, నూనె- కప్పు, ఉప్పు- రుచికి తగినంత, పసుపు- చిటికెడు, చింతపండు రసం- కప్పున్నర, సెనగపప్పు, మినప్పప్పు- చెంచా చొప్పున, ఆవాలు- ఆరచెంచా, ఎండుమిర్చి- మూడు


తయారీ: 
 ముందుగా కొత్తిమీరని శుభ్రంగా చేసి ఆరబెట్టాలి. తరవాత మెంతులు, ఆవాలను వేయించి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. చింతపండు రసాన్ని బాగా ఉడికించి పెట్టుకోవాలి. తరవాత కొంచె నూనె వేసి కొత్తిమీరను వేయించాలి. అందులో ఉప్పు, కారం, మెంతి పొడి, ఆవ పొడి వేసి మళ్లీ మిక్సీ పట్టాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించి ఉడికించిన చింతపండు రసం, రుబ్బిన కొత్తిమీర మిశ్రమం కలిపి పొయ్యి మీద నుంచి దించేయాలి. చల్లారాక పొడిసీసాలో భద్రపరిస్తే ఆరు నెలల వరకూ నిల్వ ఉంటుంది. ఇడ్లీ, దోశలో తింటే రుచిగా ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top