ఇంట్లోనేచాక్లెట్ వేఫర్స్( PERK) తయారుచేసుకుందమా....


చాక్లెట్ తయారీకి...
‘హోమ్‌మేడ్ చాక్లెట్’ తయారీకి కావలసిన ముఖ్యమైన పదార్థం కవరింగ్ చాక్లెట్. కుకింగ్ చాక్లెట్‌గా కూడా పిలవబడే ఈ వెరైటీ చాక్లెట్ సూపర్ మార్కెట్స్, బేకరీలలో లభిస్తుంది. ఇది మిల్క్, డార్క్, వైట్ అనే మూడు రకాలలో లభిస్తుంది. ఇంట్లో చాక్లెట్ తయారుచేసుకోవటానికి కావలసిన మరికొన్ని వస్తువులు: ప్లాస్టిక్ మౌల్డ్స్, వేడిని తట్టుకోగలిగిన గాజు పాత్రలు, వెడల్పాటి రబ్బర్ స్పూన్, రాపింగ్ ఫాయిల్.
చాక్లెట్‌ను ఇలా కరిగించాలి...
డబుల్ బాయిలింగ్ పద్ధతి:
ఒక వెడల్పాటి పాత్రలో తగినంత నీరు తీసుకొని మరగనివ్వాలి. ఇంకో పాత్రలో చాక్లెట్‌ను ముక్కలుగా తుంచి వేసుకోవాలి. మరుగుతున్న నీటి పాత్ర పై చాక్లెట్ ముక్కలను వేసిన పాత్ర పెట్టి నెమ్మదిగా చాక్లెట్‌ను దాదాపు కరిగిపోయేదాకా రబ్బరు స్పూన్‌తో కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చాక్లెట్ ఉన్న గిన్నెను పక్కకు తీసుకొని 2-3 నిమిషాల పాటు పూర్తిగా కరిగిపోయేవరకూ కలపాలి.


 చాక్లెట్ వేఫర్స్ తయారి :
డార్క్ చాక్లెట్ 50 గ్రా
మిల్క్ చాక్లెట్ 50 గ్రా
వేఫర్స్- 6 (మార్కెట్లో దొరుకుతాయి)
తయారి:
ముందుగా రెండు చాక్లెట్లను కరిగించుకోవాలి. కరిగించిన డార్క్ చాక్లెట్‌ను నెమ్మదిగా మిల్క్ చాక్లెట్ మిశ్రమానికి జోడిస్తూ రెండింటినీ కలుపుకోవాలి. వేఫర్ ఆకారంలో ఉన్న అచ్చును తీసుకొని అన్ని పక్కలా సన్నటి పొర వ చ్చేట్టు కలిపిన మిశ్రమాన్ని కొద్దిగా పోసుకోవాలి. దీనిపై క్రీమ్ వేఫర్‌ను పెట్టి నెమ్మదిగా ఒత్తి ఇంకొంచెం చాక్లెట్ మిశ్రమాన్ని దీని పై పోయాలి. చాక్లెట్ వేఫర్ అన్ని వైపులా సమంగా కవర్ అయ్యేట్టు చూసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వీటిని ఫ్రీజర్‌లో 10 నిమిషాల పాటు ఉంచాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top