ఎగ్ టమాట బాత్


కావలసిన పదార్థాలు
బియ్యం - పావు కేజీ

 టమాట - 150గ్రా
జీడిపప్పు - 50గ్రా
పచ్చి మిరపకాయలు - రెండు
 కోడిగుడ్లు - నాలుగు
ఆవాలు, జీలకర్ర - ఒక టీ స్పూన్
నూనె - సరిపడా
నెయ్యి - 25గ్రా,
కొత్తిమీర - తగినంత.

తయారుచేయు విధానం

ముందుగా అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాత్రలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి పచ్చి మిరపకాయలు వేసి వేయించుకోవాలి. అందులో కోడిగుడ్లను కొట్టి పోయాలి. కాసేపయ్యాక టమాటలను మెత్తగా ముద్దగా నూరి వేసుకోవాలి. తరువాత అన్నం వేసి జీడిపప్పు, ఉప్పు, తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. చివరగా నెయ్యి వేసి దింపుకోవాలి. అంతే.. ఎగ్ టమాట బాత్ రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top