ముఖానికి ఫౌండేషన్ వేసుకొనే పద్దతి

 
లంకరణలో అతి ప్రధానమైంది.. ఫౌండేషన్‌ ప్రక్రియ. దానిని ఎంచుకొనేటప్పుడు చర్మతత్వం, వాతావరణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే రకరకాల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

  • మొదటిసారి ఫౌండేషన్‌ను ఉపయోగించాలనుకునేవారు.. చర్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఆ తరవాత వీలైతే నిపుణుల సలహా మేరకు ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి.
  • జిడ్డు చర్మతత్వం ఉన్నవారు లిక్విడ్‌, పౌడర్‌ రూపంలో లభ్యమయ్యే దాన్ని తెచ్చుకోవచ్చు. పొడి చర్మతత్వం వారికి క్రీమ్‌ ఆధారితంగా దొరికే ఫౌండేషన్‌ బాగుంటుంది. ఇది పొడి చర్మానికి తేమనందిస్తుంది.
  • ముఖం మీద విపరీతంగా మొటిమలు, దద్దుర్లు ఉన్నట్లయితే ఫౌండేషన్‌ రాయకపోవడమే మంచిది. వాటికి తగిన శ్రద్ధ తీసుకొని నిపుణుల సలహామేరకు వాడటం మేలు. లేదంటే ఉన్న సమస్య రెట్టింపవుతుంది.
  • పొడి వాతావరణంలో లిక్విడ్‌ ఫౌండేషన్‌ చక్కటి ఎంపికవుతుంది. దానితోపాటు తప్పకుండా మాయిశ్చరైజర్‌ వాడాలి. అలానే కాంపాక్ట్‌ కూడా వాడవచ్చు. తేమగా ఉన్నప్పుడు అంటే వర్షం సమయంలో సాధ్యమైనంత వరకూ వేసుకోకపోవడమే మంచిది.
  • కొందరి చర్మతత్వానికి ఇది నప్పకపోవచ్చు.. అందుకు ముందుగానే చెవి వెనుక భాగంలో రాసి పరీక్షించుకోవాలి. అది రాసినప్పుడు దురదు, దద్దుర్లు లాంటివి వస్తే అసలు వాడకపోవడం ఉత్తమం.
  • ఫౌండేషన్‌ను చాలామంది చేతులతో రాస్తుంటారు. అలాంటి వారు ముందుగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే దానికి బదులు సున్నితమైన బ్రష్‌తోనూ వేసుకోవచ్చు. అలాగే ఇతరులు వాడిన బ్రష్‌ ఉపయోగించకూడదు.. వాటివల్ల చర్మ సంబంధిత ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. 
  • ల్లమచ్చలు, మొటిమలు, స్పాట్స్‌ వంటివి ఎక్కువగా ఉన్నప్పుడు తప్పకుండా కన్సీలర్‌ వాడాలి. ఆ తరవాతే ఫౌండేషన్‌. తొలగించేటప్పుడు స్పాంజ్‌ని వాడాలి.
  • ది అతిగా వేసుకుంటే ముఖానికి పూత వేసినట్లు కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకూ తక్కువగా ఉపయోగించాలి. పొరబాటున ఎక్కువైతే బ్రష్‌తో పౌడర్‌ అద్దాలి. అప్పుడు అతిగా కనిపించదు.
 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top