ఆరోగ్యానికి ఇదెంతో మేలు - విటమిన్‌ 'ఇ'


శరీరంలో విటమిన్ల పాత్ర కీలకమైంది. అవి ఏమాత్రం లోపించినా రకరకాల సమస్యలు ఎదురవుతాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకొనేది విటమిన్‌ 'ఇ'.. ఇది అందం.. ఆరోగ్యపరంగా ఎంతో ఉపయుక్తం.
వూబకాయం: 
 విటమిన్‌ 'ఇ'కి కొవ్వును కరిగించే శక్తి ఉంది. వూబకాయం ఉన్నవారు తరచూ విటమిన్‌ 'ఇ' లభించే పోషకాలను తీసుకుంటే సమస్యనియంత్రణలో ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్లు:
దీనిలో యాంటీఆక్సిడెంట్లు అధికం. అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను దూరం చేస్తాయి. క్యాన్సర్‌ కారకాలను నాశనం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మతిమరుపు సమస్య ఉండదు. ఈ విటమిన్‌ చూపు స్పష్టతకు కూడా తోడ్పడుతుంది.
రక్తకణాల వృద్ధి: 
 కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది. నాళాలలో రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది. అంతేకాదు మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళలకు వచ్చే సమస్యలను నివారిస్తుంది కూడా విటమిన్‌ 'ఇ'.
చర్మసంరక్షణ: 
పొడిచర్మం గలవారు విటమిన్‌'ఇ' లభించే పోషకాలు తీసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. అలానే దద్దుర్లు, దురద వంటివాటిని తగ్గిస్తుంది. అంతేకాదు అతినీలలోహిత కిరణాలను నుంచి శరీరాన్ని కాపాడేశక్తి దీనికుంది.
నొప్పినివారిణి:
కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కండరాలను దృఢపరుస్తుంది. అవి తేలికగ్గా కదలడానికి తోడ్పడుతుంది. వయసు పైబడుతున్నవారు ఈ విటమిన్‌ను ఎక్కువగా తీసుకోవడం మంచిదని నిపుణుల సలహా. అలానే ఎదిగే చిన్నారులకు ఇవ్వాలి.
విటమిన్‌'ఇ' లభించే పదార్థాలు:
ఆకుకూరలు, పొద్దుతిరుగుడు, నట్స్‌, టమాట, గుమ్మడికాయ, చిలగడదుంప, రాక్‌ఫిష్‌, బొప్పాయి, బ్రొకోలీ.. వంటివాటిల్లో సమృద్ధిగా లభిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top