పోషకాల రాణి... బఠాణి


ఘుమఘుమలాడే బిర్యానీ.. అందులో కమ్మగా ఉండే ఆలూ కుర్మా.. వీటిలో పచ్చిబఠాణీ లేనిదే వంటకం పూర్తికాదు. అయితే వాటిని అదే పనిగా ఎక్కువ తీసుకోవడం వల్ల సమస్యలు లేకపోలేదు. మరి వీటితో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా తగిన పరిమాణంలో ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం!

శీతాకాలమంతా పచ్చి బఠాణీలు ఎక్కువగా దొరుకుతాయి. ఇతర పప్పుదినుసులతో పోలిస్తే.. వీటిలో పోషకాలు కాస్త ఎక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. పచ్చి బఠాణీలను సాధారణ పప్పులానే ప్రతి రోజు మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. వీటిని ఉడికించి ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా జీర్ణమవుతాయి. 

  • మలబద్ధకంతో బాధపడేవారు పచ్చిబఠాణీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి తీసుకుంటే విరేచనం సాఫీగా జరుగుతుంది. రాత్రిళ్లు మాంసాహారం, మసాలా దినుసుల్లో వీటిని చాలా తక్కువగా తీసుకుంటే మంచిది. బరువు  తగ్గాలనుకునేవారు వీటిని ఇతర కూరగాయలతో కలిపి తీసుకుంటే.. ఆకలి త్వరగా వేయదు. బరువు కూడా పెరగకుండా ఉంటారు.

  •  వంద గ్రాముల పచ్చిబఠాణీలు అరగడానికి మూడు గంటల సమయం పడుతుంది. ఒక్కోసారి తాజా బఠాణీలు అందుబాటులో లేనప్పుడు ఎండిన వాటినే నానబెట్టి ఉపయోగిస్తుంటారు. అయితే వాటివల్ల కొందరికి అజీర్ణం బాధిస్తుంది. కాబట్టి వీటిని వంటసోడా, మాంసాహారం, మసాలా దినుసులతో కలిపి ఉడికించకుండా కూరగాయలతో కలిపి తీసుకోవడం మంచిది.

  •  వీటిలో ఎ, బి1, బి2, సి విటమిన్లు, ఇనుము, క్యాల్షియం, ఫాస్పరస్‌ సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి బఠాణీలను ఉడికించి ముద్దలా చేసి ఎదుగుతున్న పిల్లలకు, బలహీనంగా ఉన్నవారికి ఇస్తే బలవర్థక ఆహారాన్ని అందించిన వారవుతారు.
  •   బఠాణీలు తీసుకున్నప్పుడు అరగక కడుపులో ఇబ్బందిగా ఉంటే వాము, సైంధవ లవణం, జీలకర్ర మిశ్రమాలు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
వందగ్రాముల పచ్చి బఠాణీల్లో పోషకాలుపిండి పదార్థాలు - 14.5గ్రా
నియాసిన్‌- 2.1 మి.గ్రా
పీచుపదార్థం - 5.1 గ్రా
విటమిన్‌ 'సి'- 26మి.గ్రా
కొవ్వు - 0.4గ్రా
ఇనుము - 1.5మి.గ్రా
శక్తి- 80కెలొరీలు
మాంస కృత్తులు - 5.4గ్రా
జింక్‌- 1.2 మి.గ్రా
విటమిన్‌ 'ఎ'- 680 ఐయూ
సల్ఫర్‌- 6 మి.గ్రా
  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top