నాజూకు నడుముకు నప్పే ఆహారం

వ్యాయామం చేయకపోవడం.. ఆహార నియమాలను సరిగ్గా పాటించకపోవడం వల్ల నడుం చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. ఫలితంగా పొట్ట వస్తుంది. అది మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఆహారం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.

  •  తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రాగులు, జొన్నలు, ఓట్స్‌... తదితరాల్లో తక్కువ కెలొరీలుంటాయి. బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఫలితంగా మధుమేహం, కొవ్వును నియంత్రించిన వారమవుతాం.

  •  పొట్ట వల్ల మధుమేహం సమస్య వచ్చే అవకాశం ఉందని... పైగా వారి సంఖ్య రాన్రాను పెరుగుతోందని స్పానిష్‌ వైద్య నిపుణులు ఓ అధ్యయనంలో వెల్లడించారు. ఇందుకు మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లే ముఖ్య కారణం. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు నియంత్రించాలంటే ఆలివ్‌ నూనెను తరచూ వంటకాల్లో ఉపయోగించాలి.
  •  నీళ్లు ఎక్కువగా తాగాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తరచూ తీసుకోవాలి. ముఖ్యంగా దోసకాయ, బొప్పాయి, పుచ్చకాయ, నారింజ.. సొరకాయ, బీరకాయ.. వంటివి తరచూ తీసుకుంటే నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గుతుంది.

  •  ఎరుపు రంగు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోగలిగితే.. నడుము చుట్టూ కొవ్వు పేరుకోదు. ముఖ్యంగా ఎర్రటి క్యాబేజీ, టమాటా, యాపిల్‌, ఎర్రక్యాబేజీ, చెర్రీ.. వంటివి ఎక్కువగా తీసుకోగలగాలని సూచిస్తున్నారు ఇటలీ వైద్యులు.

  •  తరచూ గ్రీన్‌ టీ తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top