చాకొలెట్ కాజు హల్వా


కావలసిన పదార్థాలు:
పాలు-అర లీటరు
కోకో పొడి-3 స్పూన్లు
పంచదార-పావు కిలో
బ్రెడ్-2 ముక్కలు
జీడిపప్పు పొడి-50గ్రా
 కిస్‌మిస్-15గ్రా
చెర్రీస్-15గ్రా
బాదంపప్పు-15గ్రా. 
తయారుచేసే విధానం: 
స్టవ్‌పై ఒక గిన్నె ఉంచి అందులో పాలు పోసి బాగా మరిగించాలి. అర లీటరు పాలు పావు లీటరు అయ్యేదాక మరిగించాలి. ఇలా చేయడం వల్ల పాలు బాగా చిక్కబడతాయి. ఈ పాలలో బ్రెడ్ ముక్కలు, కోకో పొడి, పంచదార, జీడిపప్పు పొడి వేసి గరిటెతో బాగా కలపాలి. తర్వాత ఈ గిన్నెను స్టవ్‌పై ఉంచి కాస్త గట్టి పడిన తర్వాత ఒక ప్లేటులోకి వంచుకోవాలి. చివర్లో హల్వాపైన జీడిపప్పు, బాదం పలుకులు, కిస్‌మిస్ చల్లి ముక్కలు కోసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top