పిల్లలూ ...శాండ్‌విచ్‌ రైలు తయారు చేసుకుందామా....


కావల్సినవి: 
 బ్రెడ్డు స్త్లెసులు - నాలుగు
చీజ్‌ - కొద్దిగా
చక్రాల్లా తరిగిన క్యారెట్‌ ముక్కలు - పావు కప్పు
బీట్‌రూట్‌ ముక్క - ఒకటి 
 తయారీ:
 మూడు స్త్లెసుల్ని తీసుకుని ఒకదానికన్నా ఒకటి కాస్త పెద్దగా ఉండేలా దీర్ఘ చతురస్రాకారంలో కోయాలి. మరో స్త్లెసును చిన్నగా చతురస్రాకారంలో కోయాలి. అన్నింటినీ పళ్లెంలోకి తీసుకుని ఒకదాని వెనుక ఒకటి అమర్చాలి. ఇప్పుడు చీజ్‌ను చిన్నచిన్న చిప్స్‌లా కోసి.. స్త్లెసు ముక్కలపై ఉంచాలి. ఈ స్త్లెసుల అడుగున క్యారెట్‌ చక్రాలను ఉంచితే సరిపోతుంది. మిగిలిన చిన్న స్త్లెసు ముక్కను పైభాగాన ఉంచాలి. చివరగా  చిన్న బీట్‌రూట్‌ ముక్కను ఉంచితే చాలు.. శాండ్‌విచ్‌ రైలు సిద్ధం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top