ఉల్లి ఫ్రైడ్‌రైస్‌


కావల్సినవి: 
 అన్నం - రెండు కప్పులు
సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - కప్పు
నూనె - రెండు టేబుల్‌స్పూన్లు
ఆవాలు - చెంచా
పచ్చిమిర్చి - రెండు (పొడుగ్గా తరగాలి)
వెల్లుల్లి - నాలుగు రేకలు
ఉప్పు, మిరియాల పొడి - చెంచా
కొత్తిమీర - కట్ట
నిమ్మరసం - రెండు చెంచాలు
నెయ్యి - రెండు చెంచాలు.
తయారీ: 
 బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రేకలు వేయించాలి. రెండు నిమిషాలయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ వర్ణంలోకి వచ్చేదాకా వేయించి తగినంత ఉప్పు, మిరియాలపొడి కలపాలి. ఇప్పుడు అన్నం చేర్చి.. సన్ననిమంటపై ఉంచి బాగా వేయించాలి. ఐదు నిమిషాల తరవాత నెయ్యి వేసి.. దించే ముందు నిమ్మరసం కలపాలి. వడ్డించేముందు కొత్తిమీరతో అలంకరిస్తే చాలు.. నోరూరించే ఉల్లి ఫ్రైడ్‌రైస్‌ సిద్ధమైనట్లే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top