ఆలు మసాలా రోటీ


కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు - అర కేజీ,

అల్లం - 20గ్రా,
పచ్చి మిరపకాయలు - 50గ్రా,
నూనె -100గ్రా,
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
మైదాపిండి - 400గ్రా
సన్న రవ్వ - 20గ్రా
వంట సోడా - చిటికెడు
కొత్తిమీర
కరివేపాకు - రెండు రెబ్బలు
ఉల్లిపాయలు - 2 
తయారుచేయు విధానం
ముందుగా బంగాళదుంపలను రెండు ముక్కలుగా కోసుకుని ఉడికించుకోవాలి. తరువాత పొట్టు తీసి మెత్తగా చిదిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదాపిండిని తీసుకుని సన్న రవ్వ, తగినంత ఉప్పు, సోడా వేసి చపాతీ పిండి కంటే మెత్తగా కలుపుకోవాలి.

తరువాత అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి ఆవాలు, పప్పు దినుసులు వేసి వేయించుకోవాలి.కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి పేస్టు వేసి మరికాసేపు ఫ్రై చేసుకోవాలి. తరువాత పసుపు వేసి బంగాళదుంప ముద్ద,కొత్తిమీర ను వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఆలు మసాలా రెడీ.

తరువాత మైదాపిండిని పూరీల మాదిరిగా చేసుకుని అందులో ఆలు మసాలా మిశ్రమాన్ని పెట్టి రోటీలాగా చేసుకోవాలి. వీటిని చపాతీ పెనం మీద రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే.. ఆలు మసాలా రోటీ రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top