ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా వినిపిస్తున్న పేరు - శృతిహాసన్

From paneer
శృతిహాసన్...ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా వినిపిస్తున్న పేరు. కారణం..ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్ కూతురుగానే కాదు, ఓ సోషియో ఫాంటసీ చిత్రం ‘అనగనగా ఓ ధీరుడు’లో సిద్ధార్థ్ సరసన నటిస్తుండడం కూడా. మొదటి నుంచి శృతికి సంగీతమంటే పంచ ప్రాణం అని కమల్‌హాసన్ చెప్పుకుంటూ వచ్చినా, చివరకు తన వారసత్వంగా నటనారంగంలోకి దింపకతప్పలేదు. ‘అదీ తను ఇష్టపడి ఈ రంగంలోకి శృతిని రమ్మనలేదని’ కమల్ స్వయంగా చెబుతున్నాడు. ‘శృతికి ఎప్పుడు ఏది ఇష్టమైతే అదే చేసే అలవాటు. నేను కూడా ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పను. చెప్పలేదు కూడా’ అని ఇటీవల మీడియా ప్రశ్నలకు ఓ సమాధానంగా చెప్పారు. సంగీతం తనకు ఎంతో ఇష్టమైనా, ప్రస్తుతానికి సంగీతాన్ని పక్కనపెట్టి నటనమీదే ఎక్కువ దృష్టిపెట్టానంటోంది శృతి. ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయిన శృతిహాసన్, హాలీవుడ్ సంస్థ ఏరికోరి ఓ తెలుగు సినిమాని నిర్మించేందుకు ముందుకొచ్చిదంటే...ఆ సినిమా స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చని శృతి చెబుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ ఈ రెండూ తనకు ఇష్టమేనంటూనే, బాలీవుడ్ రేంజ్‌కి టాలీవుడ్ ఎప్పుడో ఎదిగిపోయిందని పెద్ద పెద్దమాటలే అంటోంది. సౌత్ సినిమాకి సంబంధించి టాలీవుడ్ టాప్‌ప్లేస్‌లో వుందని కూడా వివరించింది. కమల్‌కూతురుగా కాకుండా నాకు నేనుగా ఎదగాలన్నది తన ముందున్న లక్ష్యమంటూనే, తెలుగులో అవకాశాలు చాలా వస్తున్నాయని, వచ్చిన అవకాశాల్లో మంచి కథలు ఎంచుకునే దిశగా ఆలోచిస్తున్నానని, ప్రస్తుతం ఐదు ప్రాజెక్టులు చర్చల దశలో వున్నాయంటోంది. నటిగా తనని తాను నిరూపించుకున్నాక సంగీతం పై దృష్టిపెడతానని, ప్రస్తుతానికి పాటలు పాడే ఆలోచన కూడా లేదంటోంది. తెలుగులో ఎలాంటి ఇమేజ్‌ని కోరుకుంటున్నారని అడిగితే-‘్ఫలానా ఇమేజ్ అంటూ గిరిగీసుకుని కూర్చుంటే ఇక్కడ అవకాశాలు మనకు దూరంగా వెళతాయి. నాకు మాత్రం మంచి పాత్రలు చేసి, నటిగా మెప్పించాలని వుంది. ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో కథానాయికకు చాలా తక్కువ ప్రాధాన్యత వుంటోంది. హీరోల చుట్టే కథలు తిరుగుతున్నాయి. ఫలితంగా అత్యధిక శాతం ఫెయిల్యూర్సే వస్తున్నాయి. కథలపై దృష్టిపెడితే మంచి సినిమాలొస్తాయి. హీరోయిన్ పాత్రకు కూడా తగినంత ప్రాధాన్యం వుంటేనే సినిమాలను అంగీకరిస్తాను. ప్రాధాన్యం లేని పాత్రలు చేయడం కంటే ఇంట్లో కూర్చోవడమేలు. ఇప్పుడు నేను నటిస్తున్న ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంలో నా పాత్ర అందరికీ నచ్చుతుంది. సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. ఆ నమ్మకం నాకుంది’అని చెప్పుకొచ్చింది చూద్దాం..శృతి చిలకపలుకులు ఏ మేరకు నెరవేరుతాయో!!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top