థైరాయిడ్ సమస్య హోమియోతోదూరం

శారీరక, మానసిక లక్షణాలు, పరిస్థితులను పరిశీలించి హోమియో మందులను ఇవ్వడం వల్ల ఫలితం బాగుంటుంది. వైద్యుల పర్యవేక్షణలో తీసుకుంటే కాల్కేరియా కార్బ్, థైరాయిడిజమ్ ఐయోడమ్, కాలికార్బ్, అక్టియరెసిమోస, స్పాంజియ వంటి మందులు థైరాయిడ్ సమస్యకు బాగా పనిచేస్తాయి.

మావాడు అసలు ఎత్తు పెరగట్లేదు డాక్టర్ గారూ... అంటూ బాధపడేవాళ్లను చాలామందిని చూస్తుంటాం. మరీ పొట్టిగా ఉన్నవాళ్లకి హార్మోన్ థెరపీ గురించి కూడా వినే ఉంటాం. ఎత్తు పెరగడానికే కాదు.. మన బరువు, శారీరక, మాన సిక ఎదుగుద ల, ఆందోళన, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు... ఇలాంటి చాలా రకాల జీవక్రియలు థైరాయిడ్ అనే వినాళ గ్రంథి ఆధ్వర్యంలో ఉంటాయి.

థైరాయిడ్ గ్రంథి ట్రై ఐడి థైరాక్సిన్(టి3), థైరాక్సిన్(టి4), కాల్సిటోనిక్ అనే మూడురకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. జీవక్రియలు త్వరితగతిన సాగడానికి ఈ హార్మోన్స్ ఉపయోగపడుతుంటాయి. పెరుగుదలే కాకుండా రక్తపోటు నియంత్రణలో కూడా ఈ హార్మోన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. థైరాయిడ్ గ్రంథి పిట్యూటరీ గ్రంథి ఆధీనంలో ఉంటుంది.


సాధారణంగా «థైరాయిడ్ గ్రంథిలో రెండు రకాల తేడాలుంటాయి. టి3, టి4 తగ్గడం వలన హైపోథైరాయిడిజమ్, టి3, టి4 పెరగడం వలన హైపర్‌థైరాయిడిజమ్ వస్తుంది. థైరాయిడ్ సమస్యను గుర్తించనట్లయితే స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులు, మానసిక ఆందోళన, ఆత్రుత, శిరోజాలు రాలిపోవడం, సంతానలేమి, లైంగిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.

ఎలా గుర్తించాలి?

  •   కండరాలు, కీళ్లలో నొప్పులు ఉంటాయి. నీరసంగా ఉంటుంది. చేతిలో కార్పల్ టన్నెల్, కాళ్లలో టార్సల్ టన్నెల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  •   మెడ వాచినట్టుగా అనిపించడం, టర్టిల్ నెక్స్ లేక నెకెటిస్‌తో పాటు అసౌకర్యము
  •   గొంతు బొంగురుపోవడం
  •   థైరాయిడ్ గ్రంథి బయటకు కనిపించే విధంగా పెద్దగా మారడం
  •   శిరోజాలు రాలిపోవడం అనేది థైరాయిడ్ సమస్యలో కనిపించే ముఖ్యమైన లక్షణం. హైపోథైరాయిడిజమ్ ఉన్న వారిలో వెంట్రుకలు ముతకగా, మందంగా, ఎండిపోయినట్లుగా అవుతాయి. వెంట్రుకలు సులభంగా రాలిపోతుంటాయి. చర్మం రఫ్‌గా, మందంగా అవుతుంది.
  •   హైపర్‌థైరాయిడిజమ్ సమస్య ఉన్నప్పుడు మలబద్ధకం, విరేచనాలు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తాయి.
 కుటుంబంలో ఎవరికైనా థైరాయిడ్ సమస్యలు ఉన్నట్లయితే వంశపారపర్యంగా పిల్లలకు వచ్చే అవకాశం ఉంది.
థైరాయిడ్ ఉంటే....
ఆహారంలో మార్పులు చేసినా, వ్యాయామం చేసినా, కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులు వాడినా కొలెస్ట్రాల్ సాధారణ స్థాయికి రాకపోవడం అనేది హైపోథైరాయిడిజమ్‌కి సూచనగా భావించవచ్చు. తక్కువ కొలెస్ట్రాల్ స్థాయి హైపర్ థైరాయిడిజమ్‌ను సూచిస్తుంది. మానసిక ఆందోళన, ఆత్రుతతో పాటు ఆకస్మికంగా మొదలయ్యే పానిక్ డిజార్డర్స్ థైరాయిడ్ సమస్యలో కనిపించే మరికొన్ని లక్షణాలు. హైపోథైరాయిడిజమ్ సర్వసాధారణంగా మానసిక ఆందోళనతో పాటు ఉంటుంది. యాంటీ డిప్రెషన్ మందులు వేసుకున్నా ఆందోళన తగ్గకపోయినట్లయితే థైరాయిడ్ సమస్య ఉందని భావించాల్సి ఉంటుంది.

బరువులో వర్ణించలేని మార్పులు రావడమనేది హైపో లేక హైపర్ థైరాయిడిజమ్‌కి సూచన. తక్కువ కొవ్వు, క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవడంతో పాటు తగిన శారీరక వ్యాయామం చేస్తున్నప్పటికీ బరువు తగ్గకపోవడం జరుగుతుంది. డైట్ ప్రొగ్రామ్‌ను ఫాలో అవుతున్నా, వెయిట్ వాచర్స్ వంటి సపోర్టు గ్రూప్‌లో చేరినా బరువును కోల్పోవడం జరగదు. 



హైపోథైరాయిడిజమ్ ఉన్నవారు బరువు తగ్గడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఆహారం మామూలుగా తీసుకుంటున్నా బరువును కోల్పోవడమనేది హైపర్‌థైరాయిడిజమ్‌కి సూచన. రోజూ 8 నుంచి 10 గంటలు నిద్రపోయినా అలసిపోయినట్లుగా ఉండటం, సరిగ్గా పనిచేసుకోలేకపోవడం కూడా థైరాయిడ్ సమస్యను సూచిస్తుంది.

హైపోథైరాయిడ్ ఉన్నవారిలో నెలసరి సమయానికి రాకపోవడం జరుగుతూ ఉంటుంది. కొందరిలో అధికంగా రక్తస్రావం అవుతూ ఉంటుంది. నెలసరి సమయంలో ఎక్కువ బాధ ఉంటుంది. ఇవి హైపొథైరాయిడిజమ్‌ను సూచిస్తాయి. తక్కువ సమయం, తక్కువ బ్లీడింగ్, రుతుక్రమం సరిగ్గారాకపోవడం హైపర్‌థైరాయిడిజమ్‌లో కనిపిస్తుంది.

హోమియో చికిత్స
హోమియో మందుల ద్వారా హార్మోన్లను రెగ్యులేట్ చేయవచ్చు. టి3,టి4, టిఎస్‌హెచ్ సాధారణ స్థాయిలకు వచ్చే విధంగా మందులు ఇస్తారు. ఒకసారి ఈ హార్లోన్లు సాధారణ స్థాయికి వస్తే కొన్ని సంవత్సరాల పాటు థైరాయిడ్ గ్రంథి నార్మల్‌గా పనిచేస్తుంది. హార్మోన్స్ నార్మల్ అయిన వెంటనే స్థూలకాయం, నిద్రలేమి, ఆందోళన, రుతుక్రమ సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి.


శారీరక, మానసిక లక్షణాలు, పరిస్థితులను పరిశీలించి హోమియో మందులను ఇవ్వడం వల్ల ఫలితం బాగుంటుంది. వైద్యుల పర్యవేక్షణలో తీసుకుంటే కాల్కేరియా కార్బ్, థైరాయిడిజమ్ ఐయోడమ్, కాలికార్బ్, అక్టియరెసిమోస, స్పాంజియ వంటి మందులు థైరాయిడ్ సమస్యకు బాగా పనిచేస్తాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top