పోషకాల పట్టుగొమ్మ నిమ్మకాయ....ఆరోగ్యానికి... సౌందర్యానికి...


కొన్నిరకాల అనారోగ్యాలు నివారించాలన్నా.. వంటకాలకు అదనపు రుచినివ్వాలన్నా.. చింతపండుకు ప్రత్యామ్నాయం వాడాలన్నా.. టక్కున గుర్తొస్తుంది నిమ్మకాయ. విటమిన్‌ 'సి'తో పాటు అదనపు పోషకాలనందించే నిమ్మ మరెన్నో విధాలుగా మేలుచేస్తుంది.

ఆరోగ్యానికి...  


  • నిమ్మను నిత్యావసరంగానే కాదు.. ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ వాడుతుంటారు. నిమ్మరసంలో తేనె కలిపి పుచ్చుకుంటే అజీర్ణం, పైత్యం తగ్గుతాయి. నోట్లో పుండ్లు, పూత.. వంటి సమస్యలకు అద్భుతమైన ఔషధమిది. రక్తంలో కొవ్వు పేరుకొన్నప్పుడు ప్రతిరోజూ తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది. దీనిలోని సిట్రిక్‌ ఆమ్లం, యాంటీసెప్టిక్‌ సుగుణాలు కడుపులో సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి.
  •  తల తిరుగుతున్నట్లు అనిపించినప్పుడు, శరీరంలో లవణాలు బాగా తగ్గినప్పుడు నిమ్మరసం ఇస్తే త్వరగా కోలుకుంటారు. జ్వరంగా ఉన్నప్పుడు నిమ్మరసంతోపాటు, పళ్లరసాలు ఇస్తే ఆ తీవ్రత త్వరగా తగ్గుతుంది.
  • ర్బిణులకు వచ్చే వేవిళ్ల సమస్య తగ్గాలంటే నిమ్మరసం, అల్లం రసం, తేనె కలిపి ఇవ్వాలి. అధిక రక్తస్రావం, విరేచనాలను అరికట్టే శక్తి నిమ్మ సొంతం.
  • చిన్నపిల్లల్లో వచ్చే టాన్సిల్స్‌ వాపు తగ్గించడానికి చెంచా నిమ్మరసంలో కొద్దిగా తేనె, మంచినీళ్లు, చిటికెడు సైంధవ లవణం వేసి తాగించాలి. వాపు తగ్గుతుంది. నోటిలో చేప ముల్లు ఇరుక్కుంటే అరచేతిలో నిమ్మరసం వేసుకొని నాకాలి. ఇలా చేస్తే ఉపశమనం కలుగుతుంది.

  • నోటి నుంచి దుర్వాసన వస్తుంటే నిమ్మరసంలో తగినంత ఉప్పు, చిటికెడు వంటసోడా కలిపి దంతాలు రుద్దుకుంటే సమస్య నియంత్రణలో ఉంటుంది. మాంసాహారం అరగనప్పుడు నిమ్మరసం, వాముపొడి, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే చాలు.. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. నిమ్మఆకులను మెత్తగా రుబ్బి వాటి నుంచి రసం తీసి అందులో తేనె కలిపి తీసుకుంటే కడుపులో నులిపురుగులు దూరమవుతాయి.

సౌందర్యానికి...

  • రచెంచా నిమ్మరసానికి, చెంచా గ్లిజరిన్‌, పాలమీగడ కలిపి ముఖానికి రాసి చూడండి. కాంతిమంతంగా మారుతుంది. అలాగే తలలో అధిక జిడ్డు పేరుకుని దురద, వంటివి బాధిస్తుంటే.. కొబ్బరినూనెలో కాస్త నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. అరగంటయ్యాక తలస్నానం చేస్తే చాలు.

  • జిడ్డు చర్మతత్వం ఉన్నవారు.. అరచెంచా నిమ్మరసం, చెంచా పెసరపిండి కలిపి ముఖానికి పూతలా వేసి ఆరాక కడిగేస్తే చర్మంపై మురికి, జిడ్డు తొలగిపోతాయి.

  • గ్లాసుడు నీళ్లలో చెంచా నిమ్మరసం వేసి బాగా కలిపి అందులో ముంచిన దూదితో ముఖాన్ని తుడిస్తే మృతకణాలు తొలగిపోయి... చర్మం శుభ్రపడుతుంది.

జాగ్రత్తలు: 
 నిమ్మరసాన్ని నేరుగా తీసుకోవడం వల్ల దంతాలపై ఉన్న ఎనామిల్‌ పొర దెబ్బ తింటుంది. విరుగుడుగా తేనె, పంచదార, ఉప్పు తీసుకోవాలి. మూత్ర పిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతో పరిమితంగా తీసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top