కోపాన్ని తగ్గించే శశాంకాసనం...


శశాంకం అంటే కుందేలు. కుందేలు లాగా కూర్చోని వేస్తారు కాబట్టి దీన్ని శశాంకాసనం అంటారు. ఆ ఆసనం వల్ల కోపం తగ్గిపోతుంది. మానసిక ప్రశాంతత దొరుకుతుంది.

విధానం : 

ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. రెండుచేతులు నడుము వెనుకకు పెట్టి ఒక చేతితో రెండో చేతి మణికట్టును పట్టుకోవాలి. శాసవదులుతూ ముందుకు వంగాలి. నుదుటిని నేలకు ఆన్చుటకు ప్రయత్నించాలి. పిరుదుల్ని మడమల మీద నుండి కదపకూడదు.

శ్వాస పీల్చుకుంటూ మళ్లీ యధాస్థితికి వచ్చేయాలి. ప్రారంభంలో సాధ్యమైనంత వరకు వంగాలి. సామాన్యంగా ఐదు లేదా ఆరుసార్టు ఈ క్రియను చేయాలి. మెదడు మీద మనస్సును కేంద్రీకరించాలి.
రెండు పిడికిళ్లు బిగించి నాభికి ఇరువైపుల ఆన్చి పైక్రియ చేయాలి. పొట్ట మీద ధ్యానం వుంచి దీన్ని చేయాలి. 


రెండు చేతులు సాగదీస్తున్నట్లు చేస్తూ పైకి ఎత్తి వంగుతూ ఆసనాన్ని కొనసాగించాలి. ఈ దశలో చేతుల మీద ధ్యానం వుంచాలి.

రెండు చేతులు రెండు పక్కలకు చాచి ఈ క్రియ చేయాలి. ఛాతీ మీద ధ్యానం వుండాలి.

రెండు చేతుల వ్రేళ్ళను కలిపి ఇంటర్‌లాక్‌ చేసి మెడ మీద వుంచి ఈ క్రియ చేయాలి. రెండు మోకాళ్ళను, రెండు మోచేతులతో తాకాలి. మెడ మీద ధ్యానం వుంచాలి.

రెండు చేతులు వెనుకకు తెచ్చి పట్టుకొని వంగుతూ చేతులు పైకి లేపాలి. నడుం మీద ధ్యానం వుంచి దీన్ని చేయాలి.

లాభాలు : 

పవన ముక్తాసనం వల్ల కలిగే లాభాలన్నీ శశాంకాస నం వల్ల కలుగుతాయి. నడుము, మెడ నొప్పులు తగ్గుతాయి. కోపం తగ్గుతుంది. కోపం వచ్చినా త్వరగా శాంతిస్తుంది. మనసుకు ప్రశాంతంగా వుంటుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top