బ్రెడ్‌రోల్‌


కావలసినవి: 
బ్రెడ్‌ స్త్లెసులు - పదిహేను. 
స్టఫింగ్‌ కోసం:
ఉడికించిన కూరగాయలు - రెండు కప్పులు (క్యాబేజీ, బీన్స్‌, క్యారెట్‌); బంగాళా దుంపలు - రెండు (ఉడికించి మెత్తగా చేసుకోవాలి); ఉల్లిపాయలు - రెండు (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లి ముద్ద; పచ్చిమిర్చి ముద్ద- చెంచా చొప్పున; కారం - రెండు చెంచాలు; గరంమసాలా పొడి - చెంచా; పసుపు- పావు చెంచా; నిమ్మరసం- పావుకప్పు కన్నా కాస్త తక్కువ; నూనె - వేయించడానికి సరిపడా; ఉప్పు- తగినంత, కొత్తిమీర తురుము - కొద్దిగా.

తయారీ: 
 బాణలిలో నూనె వేడిచేసి అల్లం వెల్లుల్లి, పచ్చి మిర్చి మిశ్రమం ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, బంగాళాదుంప మిశ్రమం చేర్చాలి. పది నిమిషాలు వేయించి.. కారం, పసుపు, గరంమసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం, కొత్తిమీర తురుము కలిపి దింపేయాలి. ఇప్పుడు బ్రెడ్‌స్త్లెసుల అంచులు తొలగించాలి. వెడల్పాటి కప్పులో నీరు తీసుకుని ఈ స్త్లెసులన్నింటినీ అందులో ముంచి తీసి చేత్తో గట్టిగా పిండేయాలి. ఒక్కో స్త్లెసులో చెంచా చొప్పున కూర మిశ్రమాన్ని ఉంచి.. రోల్‌లా చుట్టేయాలి. అంచుల్ని తడిచేత్తో అద్దితే మిశ్రమం బయటకు రాదు. ఇలా చేసి పెట్టుకున్న రోల్స్‌ అన్నింటినీ రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరవాత బాణలిలో నూనె వేడిచేసి.. బ్రెడ్‌రోల్స్‌ను బంగారువర్ణంలోకి వచ్చేదాకా వేయించాలి. వేడివేడిగా వడ్డిస్తే సరిపోతుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top