బ్రెడ్‌ ఖీర్‌


కావల్సినవి: 
పాలు- లీటరు
బ్రెడ్‌ ముక్కలు- ఆరు
చక్కెర- అరకప్పు
యాలకులపొడి- అరచెంచా
వెన్న- చెంచా
పంచదార పొడి- చెంచా
కుంకుమపువ్వు- అరచెంచా(దంచి వేడిపాలలో కలపాలి)
బాదం, పిస్తా- పదిచొప్పున
నెయ్యి- రెండుచెంచాలు
తయారీ: 
బ్రెడ్‌ ముక్కలకు అంచులు తొలగించి పళ్లెంలో ఉంచాలి. వాటిమీద పంచదారపొడి, చెంచాపాలు, పంచదార కలిపిన వెన్న వేసి బ్రెడ్‌ ముక్కలను చేత్తో మెదిపితే చిన్నచిన్న ముక్కలుగా అవుతాయి. అలానే వాటిని పావుగంట ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇప్పుడు గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. తరవాత అందులో చక్కెర, యాలకులపొడి, బాదం, పిస్తా, కుంకుమ పువ్వు జోడించి బాగా మరిగించి.. గట్టిపడ్డాక బ్రెడ్‌ ముక్కల్ని వేస్తే సరిపోతుంది. వేడివేడి బ్రెడ్‌ ఖీర్‌ సిద్ధమవుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top