పాపాయికి తల్లిస్పర్శతో చేసే మర్దనలు

పాపాయికి తల్లిస్పర్శతో ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ నునులేత చర్మానికి.. తల్లి అపురూపంగా అందించే స్పర్శతో పాటు సున్నితంగా క్రమబద్ధంగా చేసే మర్దనలు కూడా వారికి అవసరమే. ఇవి పాపాయిని చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో మేలు చేస్తాయి.

ఇందుకోసం అందుబాటులో ఉండే స్వచ్ఛమైన కొబ్బరినూనె లేదా మార్కెట్‌లో దొరికే నాణ్యమైన బేబీ ఆయిల్‌తో మర్దన చెయ్యాలి. ముందుగా పాపాయిని కాళ్లు, అరిపాదాల నుంచి మర్దన మొదలుపెట్టాలి. అక్కడ నుంచి నెమ్మదిగా పైకి అంటే పొట్ట, ఛాతీ, భుజాలు తర్వాత ముఖం, మెడ అటు పిమ్మట బోర్లా తిప్పి వీపుని మర్దనా చెయ్యాలి. ఇదీ క్రమం..

అలాగే కాళ్లూ చేతులను నెమ్మదిగా అటు ఇటు కదిలించడం వల్ల అన్ని కండరాలకు సరైన వ్యాయామం అవుతుంది. బొటనవేలితో అరిపాదాలను సున్నితంగా వత్తుతూ మర్దన ప్రారంభించాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఆ వేళ్లతోనే ఒత్తిడి తెస్తూ కాళ్లనూ మర్దన చెయ్యాలి. ఇలా మునివేళ్లను గుండ్రంగా తిప్పుతూ చేసే మర్దన వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. పిల్లలు కూడా హుషారుగా ఉండగలుగుతారు.


నుదురు, ముక్కు, చెంపలు, చుబుకం, చెవులు, ఛాతీ, కాలి వేళ్లు, చేతి వేళ్లు ఇలా ప్రతి అవయవాన్ని కాసేపు శ్రద్ధగా నొక్కడం వల్ల వారి శరీరం మొత్తానికి రక్తప్రసరణ బాగుంటుంది. ముఖ్యంగా పొట్టపై అరచేతులను ఉంచి పైకీ కిందికీ మరీ ఒత్తిడి లేకుండా రాయడం వల్ల పిల్లల్లో ఉదర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం అందుతుంది. అంటే అజీర్తి.. కడుపుబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మలబద్ధకంతో బాధపడటం కూడా తగ్గుతుంది.


తల్లి పాలు తాగే పిల్లలకు ముఖానికి చక్కటి వ్యాయామం అందుతుంది. కారణం పాలను పీల్చడానికి పాపాయిలు వారి కండరాలకు పనిచెబుతారు. దీంతో బుగ్గలకు వ్యాయామం అందుతుంది. అలాగే తరచూ నవ్వడం, ఏడ్వడం వంటి ప్రక్రియలు వారి ముఖ కండరాలను మరింత ఉత్తేజితం చేస్తాయి. అయితే నుదురుని బొటనవేళ్లతో ఇరుపక్కలకి అధిమిపట్టి ఉంచడం వల్ల ఆ భాగానికి వ్యాయామం లభిస్తుంది. అలాగే కంటిపైన కూడా ఒక్కసారి సున్నితంగా స్పృశించాలి.

మీ కాళ్లూ రెండు చాపి పాపాయిని కాళ్లపై పడుకోపెట్టాలి. రెండు చేతులను రెండుచేతుల్లోకి తీసుకొని ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశగా కొద్దిగా వెనక్కిముందుకి కదపాలి. అలాగే కాళ్లని రెండింటిని వెనక్కిముందుకి కదపాలి. ఇప్పుడువారిని కాళ్లపై బోర్లా పడుకోబెట్టుకొని వీపు, పిరుదులపై మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల వారుహాయిగా నిద్రపోతారు. తక్కిన రోజంతా హుషారుగా ఉంటారు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top