కుటుంబ వ్యవస్థకు కేంద్ర బిందువు - ‘మహాలక్ష్మీ నివాసం’


టీవీ సీరియల్స్ నిర్మించే అన్ని సంస్థలు ‘కుటుంబం’ ప్రాతిపదికగా అనేక ఇతివృత్తాలను ఎన్నుకుని ప్రేక్షకులకు ఉత్కంఠత కలిగేలా చిత్రిస్తున్నాయి. ఇలాంటి సంస్థల్లో రాడాన్ మీడియా వర్క్స్ పేరెన్నిక గన్నది. ఆ సంస్థ నుండి వస్తున్న అనేక సీరియల్స్ తమిళ మాతృకగా వస్తున్నా, తెలుగు వారికి దగ్గరౌతున్నాయి. ఇప్పటికే ఈ సంస్థ ‘ఇది కథ కాదు’ ‘పవిత్రబంధం’ ‘పిన్ని’ ‘నిన్నే  పెళ్లాడుతా’ ‘అమ్మాయి కాపురం’ ‘ఆరాధన’ ‘చిట్టెమ్మ’ వంటి కథా బలంగల సీరియల్స్ అందించారు. ఈ సంస్థ క్రియేటివ్ హెడ్ రాధికా శరత్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాడాన్ నుండి వస్తున్న ప్రతి సీరియల్‌లో సామాజిక స్పృహ, కుటుంబ వ్యవస్థలో గృహిణుల సమస్యలు, వాటికి పరిష్కారాలు చూపే దిశగా సాగుతాయని రాధిక తెలిపారు. 

 తాజాగా ప్రొడక్షన్-23గా ఓ మెగా సీరియల్  జెమినీ ఛానెల్‌లో డిసెంబర్ 29 నుండి రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారమవుతోంది. ఇందులో రాధిక, నరేష్, లత, ఎం.ఆర్.వాసు, విక్రమ్, రాజ్యలక్ష్మి, గాయత్రి, సంతోష్ తదితరులు నటిస్తున్నారు. రాజీవ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ ‘సమాజంలో ప్రేక్షకులను ఆకట్టుకునే కథలు ఎక్కడి నుంచో రావు. నిత్య జీవితం నుండే వస్తాయి. వస్తున్నాయి. ఈ మహాలక్ష్మీ నివాసం కూడా నేటి సామాజిక కుటుంబ వ్యవస్థలో కేంద్ర బిందువైన గృహిణి తన స్థితప్రజ్ఞతో, ఆమెకు ఎదురైన అనేక కలతలు, కష్టాలు, ఎదుటివారి సూటిపోటి మాటలు వంటి ఇబ్బందులను ఎలా ఎదుర్కొంది అనే అంశానే్న ఈ సీరియల్‌లో చూపే ప్రయత్నం చేవారు. స్ర్తి ధరణి కన్నా దయ, కరుణ కలది అనే మాటతో, మానవతా దీపంతో వెలుగులు పంచి, సమస్యల్ని పరిష్కరించి ఎలా విజయం సాధించిందో ఈ సీరియల్ తెలుపుతుంది. ఏ సమస్య కూడా జీవితం కంటే గొప్పది కాదు, పరిష్కరించలేనిది కాదు. అన్ని సమస్యలకు పరిష్కారం కుటుంబంలో మాధుర్యం సమాధానమవుతుందని ఈ కథలో వివరించాం. ప్రతి ఎపిసోడ్‌లో అంతర్భాగంగా కుటుంబ కదంబంగా కనిపిస్తాయి అంటూ ముగించారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top