క్యాప్సికం స్టఫింగ్‌ కూర


కావల్సినవి: 
 క్యాప్సికం- ఐదు
బంగాళాదుంపలు - ఆరు
టమాటాలు - ఏడు
ఉల్లిపాయలు - ఐదు
జీలకర్ర - రెండుచెంచాలు
ఉప్పు, కారం - రుచికి తగినంత
పచ్చిమిర్చి - ఆరు
కొత్తిమీర - కట్ట
నూనె - ఐదు గరిటెలు
వెల్లుల్లి - ఎనిమిది పాయలు
టమాటా సాస్‌ - నాలుగు చెంచాలు
పంచదార- మూడు చెంచాలు.
తయారీ:
పచ్చిమిర్చి, కొత్తిమీర, నాలుగు ఉల్లిపాయల్ని తీసుకుని తగినంత ఉప్పు, చెంచా జీలకర్ర వేసి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించి చేత్తో చిదిమిన బంగాళదుంప ముద్దకు చేర్చాలి. అలానే టమాటాలను శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక్కో క్యాప్సికం తీసుకుని తొడిమ భాగం కోసి లొపలి గింజల్ని తీసేయాలి. ఇవి కప్పుల్లా ఉంటాయి. వీటన్నింటినీ కుక్కర్‌లో గ్లాసు నీళ్లు పోసి ఒక్క కూత వచ్చే వరకూ ఉడికించాలి. పొయ్యి మీద బాణలిపెట్టి అందులో నూనె వేడి చేసి మిగిలిన జీలకర్ర, సన్నగా తరిగిన  ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఐదు నిమిషాలయ్యాక టమాటా గుజ్జు, సాస్‌, పంచదార అరగ్లాసు నీళ్లు, కాస్త ఉప్పు, కారం చేర్చి మూతపెట్టాలి. అలానే క్యాప్సికం కప్పులో బంగాళాదుంప, ఉల్లిపాయ మిశ్రమాన్ని కూరి ఈ గ్రేవీలో వేయాలి. దించేముందు కొత్తిమీరతో అలంకరించుకొంటే క్యాప్సికం స్టఫింగ్‌ కూర సిద్ధమయినట్టే. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top