రీమేక్‌లో 'పాతాళభైరవి' సాధ్యమేనా .......?


అలనాటి అపురూప చిత్రం 'మాయాబజార్‌' రంగులద్దుకుని గత ఏడాది ప్రేక్షకులను అలరించిన దరిమిలా ఇప్పుడు మరో అద్భుత చిత్రరాజం 'పాతాళభైరవి' రీమేక్‌ కాబోతోంది. ఈ చిత్రం కేవలం రంగుల్లోనే కాకుండా 3డిలో కూడా రూపుదిద్దుకోబోతోంది. ఇది తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా శుభవార్తే.

ఎన్‌.టి.రామారావు, ఎస్‌.వి.రంగారావు, మాలతి, గిరిజ, సి.ఎస్‌.ఆర్‌., రేలంగి ప్రధాన తారాగణంగా 'పాతాళభైరవి' చిత్రాన్ని విజయా ప్రొడక్షన్స్‌ పతాకంపై నాగిరెడ్డి-చక్రపాణి నిర్మించారు. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సహాయ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు కాగా, పింగళి నాగేంద్రరావు కథ, మాటలు, పాటలను అందించారు. మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన 'కాశీమజిలీ కథలు'లోని ఒక కథ ఆధారంగా నిర్మితమైన ఈ సినిమా 1951లో విడుదలై, అటు విమర్శకుల ప్రశంసలతోపాటు ఇటు బాక్సాఫీసువద్ద సైతం భారీ విజయాన్ని సాధించి, తెలుగు సినీ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచింది.

ఈ చిత్రాన్ని త్వరలో 3డిలో పునర్నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రస్తుత యుగంలో అత్యద్భుతమైన రీతిలో గ్రాఫిక్స్‌ను ఉపయోగించుకునే వీలు ఈ చిత్రానికి వుంది. నిజానికి 1951నాటి 'పాతాళభైరవి'లోని దృశ్యాలను చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

తాజాగా ఈ సినిమాను రీమేక్‌ చేసే విషయమై నిర్మాతలు దగ్గుబాటి సురేష్‌, అల్లు అరవింద్‌ల చర్చలు జరుపుతున్నారని, మరో ఇద్దరు నిర్మాతలు కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఇంతమంది నిర్మాతలు కలుస్తూండడానికి కారణం ఇది చాలా ఖర్చుతో కూడిన ప్రాజెక్ట్‌ కావడమే. మూడు భాషల్లో నిర్మించాలని వారు భావిస్తున్న ఈ సినిమాకి రూ.80కోట్ల వరకూ బడ్జెట్‌ కాగలదని ఓ అంచనా.

అది సరే, అలనాడు ఎన్‌.టి.రామారావు నటించిన 'తోటరాముడు' పాత్ర ఈ రీమేక్‌లో ఎవరిని వరించనుంది?

ఇప్పటివరకూ తెలిసిన సమాచారాన్నిబట్టి, దగ్గుబాటి రానా హీరోగా నటించవచ్చని భోగట్టా. అయితే తన తాతగారైన సీనియర్‌ ఎన్‌.టి.రామారావు నట జీవితంలో ఒక మైలురాయి అయిన 'పాతాళభైరవి' రీమేక్‌లో నటించేందుకు జూనియర్‌ ఎన్‌టిఆర్‌ సైతం మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. ఇంతకీ కొత్త 'తోటరాముడు' ఎవరో!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top