సిక్స్‌ ప్యాక్‌తో నాగ్‌?


సుమారు రెండు దశాబ్దాలుగా ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ 'మన్మథుడి' ఇమేజ్‌ను కొనసాగిస్తున్న హీరో తెలుగు సినీరంగంలో బహుశా నాగార్జున ఒక్కరే కావచ్చు. తనకన్నా ఎంతో చిన్న వయసున్న హీరోలతో కూడా గ్లామర్‌లో ఆయన పోటీ పడడానికి ఫిట్‌నెస్‌పట్ల ఆయనకున్న శ్రద్ధే కారణం. తాజాగా కొత్త రూపంలో ఆయన కనబడబోతున్నారు.

త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనున్న 'ఢమరుకం' సినిమాకోసం సిక్స్‌ప్యాక్‌తో నాగ్‌ కనిపించబోతున్నట్టు భోగట్టా. సిక్స్‌ప్యాక్‌ సమకూర్చుకునేందుకు జిమ్‌లో ఎక్కువసేపు నాగార్జున గడుపుతున్నట్టు తెలుస్తోంది. ఇది ఆయన అభిమానులను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. 

శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రానున్న 'ఢమరుకం'లో నాగ్‌ సరసన అనుష్క నటించనుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top