జీన్స్‌ ఎంపిక చేసుకోవటం ఎలా?

 కపదహారణాల ళాశాల విద్యార్థిని అంటే.. పట్టుపరికిణీ ఓణీ కాకుండా జీన్స్‌లో నడిచొచ్చే జాబిలమ్మ గుర్తుకొస్తుంది. అంతగా ప్రాచుర్యం పొందిన జీన్స్‌ను ఎంచుకునేముందు.. కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి.

  •  జీన్స్‌ కొనేముందు ఆకృతిని దృష్టిలో పెట్టుకోవాలి. కాస్త బొద్దుగా, ఎత్తు తక్కువగా ఉన్నవారు.. మరీ వదులుగా కాకుండా.. శరీరానికి అతుక్కున్నట్లుండే జీన్స్‌ ఎంచుకోవాలి. అప్పుడు కాస్త పొడవుగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు.

  •  వస్త్రంతో పాటు.. రంగులు కూడా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడా శరీరాకృతినే దృష్టిలో పెట్టుకోవాలి. నడుం కింది భాగం లావుగా ఉన్నవారు.. ముదురు రంగు జీన్స్‌ను ప్రయత్నించాలి. అవి కూడా సాదావి కాకుండా డిజైన్లు ఉండేలా చూసుకోవాలి. అలాగే నడుంభాగం సన్నగా ఉన్న వారు... శరీరానికి అతికినట్లు ఉన్నవాటిని ప్రయత్నిస్తే.. మరింత అందంగా కనిపిస్తారు.
  •  పొడవు తక్కువగా ఉన్నవాళ్లు.. ముదురురంగు నీలం జీన్స్‌ను ఎంచుకోవాలి. సన్నగా.. పొడుగ్గా కనిపిస్తారు.

  • ఎత్తుగా ఉన్నవారు.. శరీరానికి అతికినట్లు ఉన్న జీన్స్‌ను ఎంచుకోవాలి. అప్పుడు మీ శరీరాకృతి చక్కగా కనిపిస్తుంది. అయితే జేబులు సాధ్యమైనంత వరకూ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top