ఇక బొద్దుగుమ్మను కాను...


'కొన్ని వారాలాగండి. నన్ను కొత్తగా చూస్తారు...' తనను కలసినవారితో కోలీవుడ్‌ బ్యూటీ చెబుతున్న మాటలివి.
ఇటీవలే విడుదలైన ఈమె తాజా చిత్రం 'ఇళైఞన్‌' అభిమానుల్ని అలరిస్తుండగా... త్వరలో సెట్స్‌కు వెళ్ళబోయే ఒక కన్నడ సినిమా కోసం తొమ్మిది కిలోలు తగ్గానని నమిత చెప్పింది. 'ఇళైఞన్‌' సినిమాలో కాస్త లావుగానే ఉన్నప్పటికీ అది ఆ పాత్రకు సరిపోయేది కావడం వల్ల దర్శకుడు సురేష్‌ కృష్ణ ఒప్పుకున్నారట. 

               ఇక తాజా పరిణామం ఏమిటంటే... బాలీవుడ్‌ జీరో సైజ్‌ భామ కరీనాకపూర్‌కు సలహాదారైన డైటీషియన్‌ రుజుతా దివేకర్‌ సూచనల్ని నమిత కూడా ఆచరిస్తోంది. కచ్చితమైన ఆహారపు అలవాట్లు, యోగా చేస్తూ ఇప్పటికే కొన్ని కిలోలు బరువు తగ్గింది. ''నా అభిమానులకి నిజంగానే ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి'' అంటూ... ఈ మధ్యనే నన్ను చూసినవాళ్ళు కూడా గుర్తుపట్టలేరంది.  

                      సంవత్సరం కిందట నమితను 'జగన్మోహిని'గా చూసిన అభిమానులకు చాలాకాలం తర్వాత 'ఇళైఞన్‌'లో దర్శనమిచ్చింది. ఎందుకంత సుదీర్ఘ విరామం తీసుకున్నట్లని అడిగితే... ఆ సినిమా తర్వాత తాను 18 స్క్రిప్ట్‌లు పరిశీలించానని, ఒక్కటీ సంతృప్తిని కల్గించలేదని చెప్పింది. తనకు కావలిసింది క్వీలిటీయే తప్ప క్వాంటిటీ కాదని నొక్కి చెప్పింది. ఇతర భాషల్లోనూ నటిస్తున్నానని... తెలుగులో 'సింహ' సూపర్‌హిట్‌ కాగా మలయాళం, కన్నడ సినిమాల్లోనూ కనిపిస్తున్నానందీ ముద్దు గుమ్మ. 

                 అగ్ర నటుల సరసనే నటించాలని నిర్ణయించుకున్నారా అని అడిగినప్పుడు... ''సినిమాల పేర్లు చెప్పదల్చుకోలేదు కానీ కొన్ని సినిమాల్లో నా రోల్‌ అద్భుతమని, మంచి స్కోప్‌ ఉందని చెప్పారు. తీరా షూటింగ్‌కి వెళ్ళాక అలాంటిదేమీ ఉండదు. అడిగితే ఆ అద్భుత సీన్లు తర్వాతి షెడ్యూల్‌లో ఉంటాయంటారు. అవి ఎప్పుడూ ఉండవు. ఆ మధ్య వరుసగా చేసిన మూడు సినిమాల్లో నాకిచ్చినవి చాలా తక్కువ సీన్లు, ఒక ఐటెం సాంగ్‌. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని అనుకుంటున్నాను. అందుకనే సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఏడేళ్ళుగా పరిశ్రమలో ఉన్నాను. నా పాత్ర విషయానికి వచ్చే సరికి చాలా స్వార్థంతో ఉంటున్నాను. మంచి పాత్రలు వస్తే అగ్ర నటులతో పనిచెయ్యడానికి సిద్ధం'' అని తన మనసును బయటపెట్టింది నమిత.
ఇక తమిళంలో ఆంగ్లో ఇండియన్‌గా కనిపించిన తన తాజా చిత్రం 'ఇళైఞన్‌' గురించి అడిగినప్పుడు... ఈ సినిమా చెయ్యడం ఒక సవాల్‌. అందులో లైవ్‌ డబ్బింగ్‌ ఉంది. తమిళంలో పూర్తి స్థాయిలో సంభాషణలు చెప్పే అవకాశం వచ్చింది. కలైఞర్‌ (తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి) రాసిన సంభాషణలు పలకడం ఒక గొప్ప గౌరవం.... అని మురిసిపోయిందీ సుందరి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top