తమిళంలో నటిస్తా: నాగార్జున


'రగడ' సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న హీరో నాగార్జున ప్రస్తుతం తమిళ చిత్రపరిశ్రమపై దృష్టి పెట్టాడు. తమిళ సినీ ప్రేక్షకులకు నాగార్జున సుపరిచితుడే. 'శివ', 'గీతాంజలి' చిత్రాలు తమిళంలో అనువదించగా అక్కడి ప్రేక్షకులు ఆ చిత్రాలకు బ్రహ్మరథం పట్టారు. అప్పట్లో తమిళ చిత్రపరిశ్రమలో నాగార్జున ఒక హాట్‌ టాపిక్‌గా మారిపోయాడు. అదే ఊపు మీద తెలుగు, తమిళ భాషల్లో నాగార్జునకు జోడీగా సుస్మితా సేన్‌ నటించిన 'రక్షకుడు' చిత్రం కూడా వచ్చింది. ఇంతలా తమిళ ప్రేక్షకులకు దగ్గరైన నాగార్జున మరోసారి వారిని పలకరించనున్నాడు.
               ప్రముఖ నటుడు, నిర్మాత ప్రకాష్‌ రాజ్‌ తమిళ, తెలుగు భాషల్లో రాధామోహన్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న 'పయనం' చిత్రంలో ఆయన నటిస్తున్నాడు. చానాళ్ల తర్వాత మళ్లీ తమిళ చిత్రంలో నటించటానికి దారి తీసిన కారణాలను నాగార్జున నుంచి తెలుసుకుందాం...
            ''దర్శకుడు రాధామోహన్‌ నాకు కథ చెప్పిన 10 సెకండ్ల తర్వాత 'పయనం'లో నటించటానికి ఒప్పుకున్నాను'' అని ఆయన వెల్లడించాడు. ''నావరకు పక్కా మాస్‌ మసాలా హిట్‌ చిత్రం 'రగడ'తో 2010 ముగిసింది. 2011 సంవత్సరంతో నటుడిగా 26 సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను. ఈ ఏడాది ఆరంభంలో విడుదలవుతున్న 'పయనం' నా సినీజీవితానికి సరికొత్త ఊపిరినిస్తుంది. అందుకు రాధామోహన్‌కు థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నాను'' అని నాగార్జున నవ్వుతూ చెప్పాడు. హైజాక్‌ డ్రామా నేపథ్యంగా 'పయనం' ఉంటుంది. విమానంలో చిక్కుకుపోయిన వారిని రక్షించే పాత్రలో నాగార్జున నటిస్తున్నాడు. ఆరు పాటలు, ఆరు ఫైట్ల అచ్చ తెలుగు మాస్‌ మసాలా ఫార్మూలాకు భిన్నంగా 'పయనం' తయారైంది. అయినా ఆయన ఎలాంటి చింత కనపరచలేదు. ''ఒక సినిమా సక్సెస్‌ బాధ్యతను తీసుకున్నప్పుడు 100 మందికి పైగా వ్యక్తులను చితకబాదుతూ హీరోచిత యాక్షన్‌ చిత్రాల్లో నటించటం నాకు సర్వసాధారణం. కానీ 'పయనం' దగ్గరకు వస్తే నేను స్క్రిప్ట్‌లో ఒక భాగం మాత్రమే. హిట్‌ చేసే బాధ్యత రాధామోహన్‌దే. అందుకే ఇంత ప్రశాంతంగా ఉన్నాను'' అని నాగార్జున వివరించాడు.
తమిళ చిత్రాల్లో తిరిగి నటించటంపై ఆయన మాట్లాడుతూ ''తమిళ సినిమాల్లో ఎందుకు చేయటం లేదని చాలా మంది నన్ను అడిగారు. కానీ హైదరాబాద్‌లో స్థిరపడిన నాకు తెలుగు సినిమాలు చేయటమే హాయిగా ఉంది. తమిళ చిత్రాలు చేయటమంటే చెన్నయ్‌కు తిరిగివెళ్లాలని అర్ధం. అది నావల్ల కాదు. కానీ రాధామోహన్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఆకాశమంత' చిత్రం చూసిన తర్వాత నా ఆలోచనలో మార్పు వచ్చింది. అలాంటి సినిమాలో నటించాలనే నా ఆకాంక్షను నిర్మాత ప్రకాష్‌ రాజ్‌కు అదేపనిగా చెప్పటం మొదలుపెట్టాను. నా మనసులో మాటగా చెప్పాలంటే నాకు ఇలాంటి చిత్రాలు చేయాలని ఉంది. దాంతో 'పయనం'లో అవకాశాన్ని దొరకబుచ్చుకున్నాను'' అని చెప్పుకొచ్చాడు.
ఈ అడుగు తమిళ సినిమా వైపు ఒక కొత్త పయనంగా అనుకోవచ్చా అని ప్రశ్నించగా నాగార్జున సమాధానమిస్తూ ''ఖచ్చితంగా... మంచి స్క్రిప్ట్‌లు వచ్చిన పక్షంలో తమిళ చిత్రాల్లో నటిస్తాను.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top