ఛానెళ్లలో తారల హవా!


తాజాగా సీరియళ్ల స్క్రిప్ట్‌లన్నీ బాలీవుడ్ స్టార్ల చుట్టూ తిరుగుతున్నాయనటానికి ఉదాహరణలెన్నో. ఒకవైపు రియాలిటీ షోలూ.. మరోవైపు రోజువారీ సీరియళ్లు.. ఇంకోవైపు కౌన్ బనేగా కరోడ్‌పతి - లాంటి క్విజ్ కార్యక్రమాలలో ‘స్టార్లు’ తళుకులీనటంతో ప్రైవేట్ ఛానెళ్లు సరికొత్త అందాలను సంతరించుకుంటాయి. ఈ ప్రభంజనం అమితాబ్ బచ్చన్‌తో మొదలై.. సల్మాన్‌ఖాన్, అక్షయ్ కుమార్, కత్రినా ఖైఫ్, అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం.. ఇక రాణీ ముఖర్జీ - కూడా ఇదే బాటలో నడుస్తూ - హోస్ట్‌గానో.. గెస్ట్‌గానో - కనిపించటం పరిపాటైంది.. సోనీలో ‘కౌన్ బనేగా..’ ఫోర్త్ సీజన్‌తో ‘బిగ్ బి’.. ఆయన పుత్రరత్నం అభిషేక్ కలర్స్‌లో ‘నేషనల్ బింగో నైట్...’ ప్రియాంకా చోప్రా ‘్ఫయర్ ఫాక్టర్ - ఖత్రోం కే ఖిలాడీ-3’.. మాధురీ దీక్షిత్ ‘ఝలక్ దిఖ్‌లాజా -4’.. ఇలా ఏదైతేనేం - వారివారి సామర్థ్యాన్నిబట్టి టాలెంట్‌ని బట్టి ‘నెట్టు’కొస్తున్నారు. కెబిసి-5తో అమితాబ్ తన స్టైల్‌ని ప్రదర్శిస్తూంటే.. సల్మాన్ అతనితో పోటీ పడుతూ.. అప్పుడప్పుడు నత్తనడక నడుస్తున్నాడు. బిగ్ బాస్-4 సీజన్ ముగియటంతో - దస్ కా దమ్’ తన మాటల చాతుర్యానికి మరింత పదును పెడుతున్నాట్ట. అమితాబ్ తర్వాత ఛానెళ్లలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నది సల్మాన్ ఖానేనట.
 

కార్యక్రమాల బాగోతం ఇదైతే - ఆఖరికి పిక్చర్ ప్రమోటింగ్‌కి ఛానెళ్లనే ఉపయోగించుకోవటం. సినిమా విడుదలవుతూందనగా.. రిలీజైన తర్వాత - ఇలా అంచెలంచెల మోక్షంలా సినిమాని ప్రమోట్ చేయటం.. కథా కమామీషు చెప్పటం.. సినీ పక్షులకు అలవాటే. రిషీ కపూర్ - నీతూ.. మల్లికా షెరావత్, అజయ్ దేవ్‌గన్.. రాణీ ముఖర్జీ, విద్యాబాలన్ ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ గురించి - ‘తీస్ మార్ ఖాన్’ కోసం కత్రినా కైఫ్, అక్షయ్.. బాబీ డియోల్, ధర్మేంద్ర, కుల్‌రాజ్ రణ్‌ధావె.. ‘యమ్లా పగ్లా దీవానా’.. లాంటి కార్యక్రమాలతో ఛిర్రెత్తించేస్తారు.

ఇక - సాస్-బహుల జోలికి తారాగణం వెళ్లకపోవటం వొకింత నిరాశకు గురి చేసినప్పటికీ - త్వరలోనే ఆ మెలోడ్రామాలోనికి ‘స్టార్స్’ వెళ్లరన్న గ్యారంటీ ఏమీ లేదు. మరో చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే - అత్తాకోడళ్ల ప్రహసనం ఎంతగా వేళ్లూనుకుందో? ‘వంటా-వార్పూ’ కూడా అంతగా ప్రాచుర్యం పొందిందనటానికి మధ్యాహ్నం ఏ ఛానెల్‌ని తిరగేసినా కనిపించే వంటల కార్యక్రమాలే ఉదాహరణ. రాజస్థానీ, గుజరాతీ, మహరాష్ట్రియన్, బెంగాలీ, పంజాబీ.. ఇలా ఒకటి కాదు.. భాషలూ, ప్రాంతాల సరిహద్దులను చెరిపేసి ‘వంటలు’ దూసుకుపోతున్నాయి.
 

మానవ జీవితంలో ఛానెళ్లు అంతర్భాగంగా మారాయి. ఆపైన రియాలిటీ షోలతో వెర్రెత్తించి.. పెళ్లి వేడుకలను సైతం జనానికి అందించటంలో ముందంజ వేశాయి. ‘బిగ్ బిస్’ హౌస్‌లో అలీ మర్చంట్.. సారాఖాన్‌ల పెళ్లి.. మరోవైపు ‘రాఖీ కా ఇన్సాఫ్’తో ఛానెళ్లు వివాదంలో పడ్డాయి. ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని తలకెత్తుకుంటే ‘టిఆర్‌పి’ రేటింగ్స్ అత్యున్నత స్థాయికి చేరతాయన్న సిద్ధాంతాన్ని ప్రతి ఛానెల్ వొంటబట్టించుకున్నాయి. దీంతో ఏవేవో జిమ్మిక్కులూ.. చమక్కులూ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top