ఒత్తిడిని జయించే సప్తపది

ఈ కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా అందరిలో కనిపించేది ఒత్తిడి. తీవ్రమైన ఒత్తిడి వల్ల చర్మసమస్యలు, కడుపులో అల్సర్లు, బిపి, నిద్రలేమి లాంటి సమస్యలు వచ్చిపడతాయి. ఎప్పుడూ చిరాకుపడుతున్నారంటే వాళ్లు చాలా ఒత్తిడిలో ఉన్నారన్నమాటే. దీన్ని తప్పించుకోవాలంటే మనలోనే కొన్ని మార్పులు చేసుకోవాలి.

1. లక్ష్యం:

స్పష్టమైన లక్ష్యం అనేది ఉండాలి. దీనివల్ల మనసులో గజిబిజి లేకుండా మనకు కావాల్సిందేమిటన్న దాని పట్ల అవగాహన ఉంటుంది. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది.

2. ఆహారం:

కాఫీ, టీ, ఆల్కహాల్, పంచదార స్ట్రెస్‌ను పెంచుతాయి. వీటి బదులు గ్రీన్‌టీ తీసుకోవచ్చు. పంచదార బదులు తేనె వాడవచ్చు. తీసుకొనే ఆహారం ఆదరాబాదరాగా కాకుండా నింపాదిగా తినాలి.

3. స్నానం:

వేడినీటితో స్నానం వల్ల ఎంతో రిలాక్స్ అవుతాం. ఒత్తిడి ఎక్కువగా ఉందనుకున్నప్పుడు గోరువెచ్చని నీటిలో లావెండర్ ఆయిల్ వేసి స్నానం చేయడం మంచిది.

4. అరోమాథెరపీ :
సువాసనలు ఒత్తిడిని తగ్గిస్తాయి. ముఖ్యంగా లావెండర్ ఫ్లేవర్ ఉన్న పర్‌ఫ్యూమ్స్‌ని వాసన చూడటం వల్ల రిలాక్స్ అవుతాము.

5. వ్యాయామం:
ఎక్సర్‌సైజ్‌లు చేసేటప్పుడు మెదడు సంతోషం కలిగించే హార్మోన్లను విడుదల చేస్తుంది. దీనివల్ల మానసికంగా కూడా రిలాక్స్ అవుతాం. కాబట్టి వాకింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్... ఇలా ఏదైనా చేయండి. యోగా, ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు కూడా శరీరాన్నే కాకుండా మనసునూ తేలికపరుస్తాయి.

6. ఆధ్యాత్మికత:
ఇష్టదేవతా ప్రార్థన చేయడం వల్ల ధ్యానంతో కలిగే రిలీఫ్ ఉంటుంది. ఎదుటివారికి సాయం చేయడం ద్వారా కలిగే సంతోషం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది.

7. షేరింగ్:
మీరు ఎదుర్కొంటున్న సమస్య గురించి ఆత్మీయులతో చర్చించడం వల్ల పరిష్కారం దొరకడమే కాకుండా మీ బాధను పంచుకోవడం వల్ల రిలీఫ్ అవుతారు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top