నాజూగ్గా(స్లిమ్ గా) ఉండేందుకు నాలుగు సూత్రాలు

నాజూగ్గా ఉండాలని కోరుకొనే వారి శాతం పెరిగిపోయింది. కాలేజీ కుర్రకారు నుంచి ఉద్యోగుల దాకా ప్రతి ఒక్కరూ స్లిమ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అమ్మాయిలైతే కడుపునిండా తింటే లావైపోతామంటూ పొట్ట మాడ్చుకుంటున్నారు. నిజానికి ఏం తినాలి? ఎలా తినాలో తెలియక ఎక్కువ మంది తంటాలు పడుతున్నారని, పద్ధతి ప్రకారం తింటే నాజూగ్గా ఉండడం కష్టమే కాదు .

1. నిద్రలేచిన 15 నిమిషాలకల్లా ఏదో ఒక తేలికపాటి ఆహారం తప్పక తీసుకోవాలి.
2. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినాలి.
3. ఎక్కువ పని చేసే సమయంలో ఎక్కువగా తినాలి. పని తక్కువగా ఉన్నప్పుడు ఆహారాన్ని తగ్గించాలి.
4. రాత్రి నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందయినా రాత్రి ఆహారం తీసుకోవడాన్ని ముగించాలి.
 
ఈ సూచనలు ఇప్పటికే మేం పాటిస్తున్నాం. అయినా లావైపోతున్నాం అనుకుంటున్నారు కదూ? ఇలా చేయాలని అనుకుంటాం కానీ చాలాసార్లు ఆచరణలో పెట్టం. ఈ రోజు నుంచి గట్టిగా ప్రయత్నం చేసి ఈ సింపుల్ సూత్రాలు పాటించండి. నాజూగ్గా ఉండండి. గుడ్‌లక్. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top