వర్మకు ఆలస్య గండం?

దర్శకుడు రాంగోపాల్‌వర్మ రూపొందించిన హిందీ, తెలుగు సినిమాల విడుదలకు 'ఆలస్య గండం' పట్టింది. ఆయన తీసిన పలు సినిమాలు ముందుగా ప్రకటించిన విడుదల తేదీకల్లా థియేటర్లకు చేరిన దాఖలాలు ఇటీవల కనిపించలేదు. ఇందుకు 'రక్త చరిత్ర' కూడా మినహాయింపుకాదు. తాజాగా... ఆయన కొత్త సినిమా 'కథ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు' వంతు వచ్చింది. దీని విడుదల కూడా మరో వారం ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. 

అప్పల్రాజును జనవరి 12 కల్లా థియేటర్లకు పంపాలని తొలుత అనుకున్నప్పటికీ ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని సన్నివేశాలు ఇంకా చిత్రీకరణలోనే ఉన్నందువల్ల ముందుగా నిర్ణయించిన ప్రకారం విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఒక సన్నివేశంలో 23మంది అత్యంత ప్రముఖ నటులు ఈ సినిమా కోసం ఒకేసారి సెట్స్‌కు రావాల్సి ఉందట... ఇది దాదాపు అసాధ్యంలా కనిపిస్తున్నదని టాలీవుడ్‌ ఉవాచ.  

ఇక ఈ సినిమా నిర్మాత కోనేరు కిరణ్‌ కుమార్‌ జనవరి 19న 'అప్పల్రాజు'ను విడుదల చెయ్యాలని భావిస్తున్నారట.
టాలీవుడ్‌ సినిమాపై వ్యంగ్యాస్త్రాలు సంధించే ఈ సినిమాను సంక్రాంతి నాటికి విడుదల చెయ్యాలని మొదట భావించారు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top