బరువును పెంచే ఆహారం

అధికబరువున్నవారు సన్నగా మారడం ఎంత కష్టమో.. మరీ సన్నగా ఉన్నవారు.. లావుగా కావడం అంతే కష్టం. ఇలాంటివారూ ఆహారాన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. అందుకేం చేయాలంటే.. 
  •   మీరు తీసుకునే పదార్థాల నుంచి అందే కెలొరీలను ఓసారి లెక్కించండి. రోజులో మీరు తీసుకునే ఆహారం నుంచి 1900 కెలొరీలు అందుతున్నట్లయితే.. మీకు ఇంచుమించుగా సరిపోతాయి. ఇప్పుడు ఆ మోతాదును ఇకపై పెంచండి. దాదాపు వెయ్యి కెలొరీలు అధికంగా అందేలా ఆహారం తీసుకోండి.
  •  రోజులో రెండు నుంచి మూడుసార్లు మాత్రమే ఆహారం తీసుకుంటున్నారా.. ఇకపై ఐదు విడతలుగా ఆహారాన్ని తినండి. అలాగే బ్రెడ్డు బదులు పాల ఉత్పత్తులు, చేపలు, మంసాహారాన్ని ఎంచుకోండి. కూరగాయలకు బదులుగా కోడిగుడ్లు తినండి. మాంసకృత్తులు ఎక్కువగా అందించే బీన్స్‌, పప్పులు, బఠాణీలు.. వంటివి ఎంచుకోండి. అలాగే గంజిశాతాన్ని ఎక్కువగా అందించే బంగాళాదుంపలు, వరిఅన్నం మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఉండాలి.

  •  రోజులో అప్పుడప్పుడు అధికకెలొరీలున్న స్నాక్స్‌ తీసుకోవడం తప్పనిసరి పనిగా పెట్టుకోండి. వాటిల్లో డ్రైఫ్రూట్స్‌, పెరుగు.. వంటివి ఎక్కువగా ఉండాలి.
  •  మీకు టీ తాగే అలవాటుంటే.. బదులుగా రోజూ రెండుసార్లు గ్లాసు పాలు తాగండి. పోషకాలు కెలొరీలు అందేలా.. పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవడం మొదలుపెట్టండి.

  •  మీరు తీసుకున్న ఆహారం తాలూకు వివరాలను ఎప్పటికప్పుడు ఓ చోట రాయండి. ఆ ప్రకారం అవసరమనుకుంటే మార్పులు చేసుకోవచ్చు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top