సిద్దూతో శృతి డేటింగ్‌?


సీనియర్‌ నటుడు కమల్‌హసన్‌ కుమార్తె, నటి శృతిహసన్‌ మరోసారి వార్తల్లోకెక్కింది.
ఆమె 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంతో తెలుగు సినీరంగంలో ఆరంగేట్రం చేస్తోంది. అయితే ఆమె వార్తల్లో చోటుచేసుకున్నది మాత్రం తన సహనటుడు సిద్దార్ధ విషయంలో.
చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో శృతి, సిద్దార్థ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ కనిపించినట్టు సినీవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వారిద్దరూ ఎంతో సన్నిహితంగా వుండడం చూసి ప్రేమ వ్యవహారం వుందన్న అనుమానాలను సినీజనాలు వ్యక్తపరుస్తున్నారు. 

'అనగనగా ఓ ధీరుడు' సినిమాలో ఒక యోధుడి పాత్రను సిద్దార్థ పోషిస్తూండగా, అతని ప్రేయసిగా శృతి నటిస్తోంది.
ఇంతకుముందు 'రంగ్‌ దే బసంతి' సినిమాలో నటించినప్పుడు తన సహనటి సోహా ఆలీఖాన్‌తో సిద్దార్థ డేటింగ్‌ చేశాడని వదంతులు వినిపించాయి. 2006లో భార్య మేఘనతో అతను విడాకులు తీసుకున్నాడు. కాగా తనకూ, సిద్దూకు వున్నది మంచి స్నేహం మాత్రమేనని శృతి చెబుతోంది. నిజమేమిటో వారికే తెలియాలి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top