అనగనగా ఓ సాంకేతిక మాయాజాలం


ధీరుని సరసన ధీరవనితలా తెలుగు తెరపైకి దూసుకొస్తో్తంది అందాల తార శృతిహాసన్‌. తనని తెలుగు సినిమాకి పరిచయం చేస్తూ వస్తున్న చిత్రం ‘అనగనగా ఒక ధీరుడు’లొ నటించడం చాలా ఉద్వేగాన్నిచ్చిందని అంటోంది. ఈ చిత్రంలో నా పాత్రపేరు ప్రియ. మిస్టరీ, వైవిధ్యత కలగలిసి ఉండే పాత్ర. రోమన్‌ సుందరిని తలదన్నేలా తెరపై కనిపిస్తాను.

కథ, కథనం చాలా కొత్తగా ఉంటాయి. స్క్రిప్టు చదివేటప్పుడు ఉద్వేగానికి లోనయ్యాను. దర్శకుడు ప్రకాష్‌ ఈ సినిమాని అద్భుత దృశ్యకావ్యంలా తెరకెక్కించారు. గంటపాటు సాగే గ్రాఫిక్స్‌ సహా విజువల్స్‌ అద్భుతం అనిపిస్తాయి. దర్శకుడు తొలుత కథ వినిపించినప్పుడే చాలా ఆసక్తి అనిపించింది. ఏమాత్రం ఆలోచిం చకుండా నటించేయొచ్చని అప్పుడే నిర్ణయించేసుకున్నా.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top