బాదంతో బరువు ఉఫ్‌...ఉఫ్‌...


          మేనికి కొత్త కాంతిని నిగారింపును ఇచ్చే బాదం గింజలకు అధిక బరువును తగ్గించే శక్తి కూడా ఉందని తాజా అధ్యయనాల్లో తేలింది. చర్మ సౌందర్యానికి ఉపకరించే విటమిన్‌ ఇతో పాటు బాదం నుంచి మెగ్నీషియం, మాంగనీసులు సమృద్ధిగా అందుతాయి. పీచు, మాంసకృత్తులు పుష్కలంగా ఉండే వీటిని ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఓ గుప్పెడు తినడం వల్ల శరీరం చక్కని తీరును.. ఆకృతిని సంతరించుకొంటుంది. సాయంత్రం పూట స్నాక్‌గా శీతలపానీయాలకు బదులుగా నానబెట్టిన బాదాములు లేదా వేయించిన వాటిని తీసుకెళితే బరువు తగ్గడానికి ఎంతో ఉపయుక్తం. తొందరగా కడుపునిండిన భావన కలగడమే ఇందుకు కారణం. ఏ సమయంలో వీటిని ఆహారంగా తీసుకోవచ్చని అంటున్నారు పోషకాహార నిపుణులు. కొవ్వు తక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు దరిచేరవు. గర్భిణులు వీటిని రోజూ తీసుకోవడం వల్ల సురక్షిత జననంతో పాటు.. ప్రసవం తర్వాత అధిక బరువు రాకుండా కాపాడుకోవచ్చు. దీనిలోని ఫోలిక్‌ యాసిడ్‌, ఇనుము తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడి ప్రసవం తర్వాత తల్లి తిరిగి పూర్వ ఆకృతిని సంతరించుకోవడానికి దోహదం చేస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top