ఇంట్లో కూరగాయలతో సౌందర్యపోషణ

అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి బోలెడు ఖరీదు వెచ్చించి సౌందర్య సాధనాలు కొని తెచ్చుకోకుండా.. ఇంట్లో సామగ్రిని ఎంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మన వంటిల్లే ఇందుకు ఖజానా. ఇంట్లో మిగిలినపోయిన కూరగాయలు వృథాగా పక్కన పెట్టేయక వాటితో సౌందర్యపోషణకు సిద్ధంకండి..
  • దోసకాయ ముక్కలను మెత్తగా రుబ్బి అందులో నాలుగు చుక్కల నిమ్మరసం, గులాబీనీరు జోడించి ఆ మిశ్రమాన్ని ముఖం, వీపు భాగానికి మర్దన చేయాలి. దానివల్ల మృతకణాలు, జిడ్డు తొలగిపోతాయి. అంతేకాదు ఇది మంచి టోనర్‌లా పని చేస్తుంది.
  • చెంచా నిమ్మరసంలో అరచెంచా పాలు, దోసకాయరసం కలిపి ముఖానికి రద్దితే... చర్మం తాజాగా కనిపిస్తుంది. దోసకాయ రసంలో నాలుగు చుక్కల నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక చల్లటినీళ్లతో కడిగేస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది అన్ని చర్మతత్వాల వారికీ నప్పుతుంది.
  • బంగాళాదుంపలను తరిగి, మెత్తగా రుబ్బి రసం తీయాలి. దాన్ని రాత్రి పడుకొనే ముందు ముఖానికి రాసుకోవాలి. మర్నాడు కడిగేసుకుంటే చర్మం తాజాగా కనిపిస్తుంది. చిన్న టమాటా ముక్కను ముఖానికి రుద్దుతూ ఉంటే నల్లమచ్చలు, తొలగిపోయి చర్మానికి తేమ అందుతుంది.
  • రెండు చెంచాల టమాటా రసంలో చెంచా తేనె కలిపి ముఖం, మెడకు మర్దన చేయాలి. పావుగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో కడిగేస్తే జిడ్డు తొలగి.. చర్మం మృదువుగా తయారవుతుంది.
  • మోచేతుల నలుపు తగ్గాలంటే క్యారెట్‌ను ఉడికించి ముద్దగా చేసి అందులో పంచదార లేదా ఉప్పు కలిపి ఆ ప్రాంతంలో బాగా మర్దన చేస్తే సరి. క్యారెట్‌ ముద్దకు కమలా రసం పంచదార కలిపి ముఖానికి, మెడకు ఇరవై నిమిషాల పాటు మర్దన చేస్తే జిడ్డు తొలగిపోయి.. చర్మం కాంతులీనుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top