పనీర్‌ రోల్‌


రోల్‌కోసం కావలసినవి:  
సెనగపిండి - కప్పు; పెరుగు - అరకప్పు; నీళ్లు - రెండు కప్పులు; పచ్చిమిర్చి - మూడు; అల్లం మిశ్రమం- అరచెంచా; ఉప్పు - తగినంత; మెంతి ఆకులు- అరకప్పు; కోడిగుడ్డు- ఒకటి; నూనె- కప్పు
స్టఫింగ్‌ కోసం:  
తురిమిన పనీర్‌ - రెండు కప్పులు; ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరగాలి); పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగాలి); కొత్తిమీర తురుము - కప్పు; ఉప్పు - చిటికెడు.
తయారీ:
  స్టఫింగ్‌ కోసం సిద్ధం చేసుకున్న పదార్థాలన్నింటినీ ఓ పాత్రలోకి తీసుకుని బాగా కలపాలి. ఇప్పుడు కోడిగుడ్డు, నీళ్లు, పెరుగు, ఉప్పు, పచ్చిమిర్చి, సెనగపిండి తీసుకుని అన్నింటినీ మిక్సీలో వేసుకోవాలి. ఇది పిండిలా తయారవుతుంది. 
ఇందులో మెంతిఆకులు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. అంటే మరీ గట్టిగా అలాగని పలుచగా కాకుండా.. ఉండాలి. ఈ పిండి ఐదు నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు పాన్‌లో చెంచా నూనె వేసి ఈ పిండిని పలుచగా దోశలా వేసుకోవాలి. ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న స్టఫింగ్‌ మిశ్రమాన్ని చెంచా ఉంచి రోల్‌లా చుట్టేయాలి. ఇలా చేసుకున్న రోల్స్‌ను మరోసారి పెనంపై రెండువైపులా కాల్చితే సరిపోతుంది. టమాటాసాస్‌తో వేడివేడిగా వడ్డించండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top