అధ్భుతం... ఆజాదీ టవర్‌


హొస్సేన్‌ అమానత్‌ అనే ఆర్కిటెక్ట్‌ టెహ్రా న్‌లోని ఆజాదీ కల్చరల్‌ కాంప్లెక్స్‌ లో... సస్సానిద్‌, మహమ్మదీయ వాస్తు ప్రత్యే కతలను మేళవించి నిర్మించ తల పెట్టిన... ఒక స్థూపాన్ని రూపకల్పన చేసే అవకా శాన్ని చేజిక్కించుకున్నాడు. ఇందు కోసం జరిగిన కాంపిటీషన్‌లో ఆయన గెలిచాడు. టెహ్రాన్‌ లోని ఆజాదీ స్క్వేర్‌లో ఉన్న ఆజాదీ కల్చరల్‌ కాంప్లెక్స్‌లో అంతర్భాగంగా ఈ స్థూపం రాబో తోంది. ఆజాదీ స్క్వేర్‌ మొత్తం 50,000 చ మీ విశాల ప్రదేశం. టవర్‌ చుట్టూ ఎన్నో ఫౌంటేన్లున్నాయి. అండర్‌గ్రౌండ్‌లో ఓ మ్యూజి యం కూడా ఉంది. మాన్యుమెంట్‌ దె మార్టై ర్స్‌ ఇన్‌ అల్జియర్స్‌ (1982లో నిర్మితం) డిజైన్‌ పరంగా, దాని వివరాల రీత్యా దీని బలీయమై న ప్రభావాన్ని కలిగివుంది.


ఎస్పషాన్‌ ప్రాంత పు తెల్ల పాలరాతితో కట్టిన ఈ స్థూపంలో 8 వేల రాతి బ్లాకులున్నాయి. గనుల గురించి అద్వితీయమైన అనుభవమున్న ఘన్బర్‌ రాిహ మి ఈ ఈ రాళ్ళను సరఫరా చేసి అమర్చాడు. ఇతను ‘‘సుల్తాన్‌-ఎ-సంగ్‌-ఎ-ఇరాన్‌’’ గా ప్రసిద్ధుడు. ఈ బ్లాకుల్లో ప్రతి ఒక్కదాని ఆకా రాన్ని కంప్యూటర్‌తో కొలిచారు. బిల్డింగు పని కోసం అన్ని ఆదేశాలను ప్రోగ్రాం చేశారు. ఇ రాన్‌లోని అత్యంత నిష్ణాతుడైన రాతి-తాపీ ని పుణుడు గఫర్‌ దవర్పన వర్నోస్ఫదెరని స్థూ పం నిర్మాణ బాధ్యతను నిర్వహించాడు. 5 వందల ఇరానీ పారిశ్రామికవేత్తల బృందం స్థూపం నిర్మాణానికి నిధులందించింది. 1971 అక్టోబరు 16 న స్ఠూపాన్ని ఆవిష్కరించారు.

ఐక్యూ... నెం. 1 కిమ్




1962లో జన్మించిన కొరియాకు చెందిన కిమ్‌ ఉంగ్‌-యోంగ్‌ తన 4 ఏట విశ్వవిద్యాలయానికి హాజరయ్యాడు. 15 ఏట పి.హెచ్‌డి పట్టా పుచ్చు కున్నాడు. ఈనాడు అనూహ్యమైన స్థాయిలో తెలివి తేటలున్న వ్యక్తి ఇతడే. ఈ ధరిత్రిపై అత్య ధిక స్థాయి ఐక్యు (తెలివితేటలు) వున్న వ్యక్తిగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గుర్తించింది. 4 ఏళ్ళ చిరుత ప్రాయంలోనే జపనీస్‌, కొరియన్‌, జర్మన్‌, ఇంగ్లీషు భాషలు చదవగలిగాడు. తన 5వ పుట్టిన రోజు నాటికి సంక్లిష్టమైన ఢిఫరెన్షి యల్‌ ఇంటిగ్రల్‌ క్యాలిక్యులస్‌ (అవకలన-సమా కలన కలనగణితం) సమస్యలు పరిష్కరించగలిగాడు.
 

ఆ తర్వాత జపనీస్‌ టెలివిజన్‌లో చైనీస్‌, స్పానిష్‌, వియత్నమీస్‌, టాగలోగ్‌, జర్మన్‌, ఇంగ్లీ ష్‌, జప నీస్‌, కొరియన్‌ భాషల్లో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శిం చాడు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అత్యధిక స్థాయి ఐక్యు (తెలివితేటలు) జాబితాలో కిమ్‌ ను పేర్కొంది. పిల్లవాడి స్కోరును 210 పైన బుక్‌ అంచనా వేసింది. తన 3 వ ఏటి నుంచి 6 ఏళ్ళ వయసు వరకు కిమ్‌ హాన్యాంగ్‌ విశ్యవిద్యాలయం లో అతిథి విద్యార్థిగా భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. అతని ఏడవ ఏట నాసా అమెరికాకు ఆహ్వానించింది. విశ్వవిద్యాలయం చదువు పూర్తిచే సుకుని 1974లో తన 15 ఏట కొలరాడో స్టేట్‌ యూనివర్శిటీలో భౌతికశాస్త్రంలో పి.హెచ్‌డి పట్టా పొందాడు.

యూనివర్శిటీ చదువుల కాలంలోనే నా సాలో తన అధ్యయన కృషిని ప్రారంభించాడు. 1978లో కొరియాకు తిరిగి చేరుకునేంతవరకూ ఈ కృషి కొనసాగించాడు. ఆ తర్వాత సివిల్‌ ఇంజ నీరింగ్‌కు మారాడు. చివరికి ఈ రంగంలో కూడా డాక్టరేటు పొందాడు. కొరియాలోని అత్యంత ప్రతి ష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో చదువుకునే అవ కాశాలు కిం కు వచ్చాయి. వాటిని కాదని ఒక ప్రా ంతీయ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. 2007 నాటికి చుంగ్‌బక్‌ జాతీయ విశ్వవిద్యాలయంలో అనుబంధ అధ్యాపకుడుగా సేవలందిస్తున్నాడు.

అత్యంత భయంకరమైన రెస్టారెంట్‌  




బెల్జియంలో ఇదో అత్యంత భయం కరమైన రెస్టారెంట్‌. ఈ రెస్టారెం ట్‌ పేరు ‘టి స్పూక్‌ హైస్‌’ రెస్టారెంట్‌. ఇది దెయ్యాల బార్‌ అనీ, ఇక్కడ 1,000 దెయ్యాలు ఉంటాయని చెబు తారు స్థానికులు. ఈ రెస్టారెంట్‌కు రావడానికి కస్టమర్లు హడిలిపోతారట. అందు వల్ల 2008 నుండి ఈ రెస్టారెంట్‌ మూసేశారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top