కొంచెం జాగా ఇస్తే పాగా వేసేస్తా !


కొంచెం జాగా ఇస్తే చాలు టాలీవుడ్‌లో పాగా వేసినట్లే, బాలీవుడ్‌లోనూ పాగా వేసేస్తానని అంటోంది ఇలియానా. రణబీర్‌కపూర్‌ హీరోగా రూపొందే ఓ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా ఎంపికైన ఇలియానా.. ఆ చిత్రం విడుదలకు ముందు, లేదా ఆ చిత్రం స్టిల్స్‌ విడుదలకు ముందే తన సొగసుల సత్తా చాటిచెప్పాలని నిర్ణయిచుకుంది. ‘ఎఫ్‌హచ్‌ఎం’ అనే ఓ ఇంగ్లీషు మ్యాగజైన్‌కు హాట్‌ హాట్‌గా ఫోజులిచ్చింది. కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి, అక్కడ కూడా జయకేతనం ఎగురవేయాలని ఇలియానా ఎంతో ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. దాంతో బాలీవుడ్‌ అయితే ఇండియాలోని మొత్తం వుడ్‌లు అంటే మల్లూవుడ్‌ (మలయాళం), శాండల్‌వుడ్‌ (కన్నడ) వంటివన్నీ కవర్‌ అయిపోతాయనే ఆలోచనతో బాలీవుడ్‌లో బలంగా పాగా వేయాలని పావులు కదుపుతోంది. అందుకే మెయిన్‌ హీరోయిన్‌గా అవకాశం రాకపోయినా, దానికోసం వెయిట్‌ చేస్తూ సమయాన్ని వృథా చేసుకోకుండా సెకండ్‌ హీరోయిన్‌గా చేసేందుకు అంగీకరిం చింది ఇలియానా. టాలీవుడ్‌లో నెంబర్‌ ఒన్‌ హీరోయిన్‌గా వెలు గొందుతున్న ఇలియానా సెకండ్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసేందుకు అందుకే అంగీకరిం చింది!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top