కంటి సోయగం.. ఇలా సొంతం

ళ్లకింద నల్లటి వలయాలు ముఖం మీద ఇబ్బందికరంగా కనిపిస్తుంటాయి. ఒక్కోసారి ఎన్ని క్రీములు వాడినా ఫలితం ఉండదు. అందుకే ఒకసారి ఇంట్లో పదార్థాలను ప్రయత్నించి చూడండి... ప్రయోజనం ఉంటుంది. బయటి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కళ్లను శుభ్రంగా కడుక్కోవాలి.
  • రెప్పల కింద దూదితో తుడిచి మృదువుగా కొబ్బరినూనెతో మర్దన చేయాలి. దాంతో హాయిగా నిద్రపడుతుంది, వలయాలు తగ్గుముఖం పడతాయి. 
  • కీరదోస వల్ల కూడా చక్కని ఉపశమనం లభిస్తుంది. కీర రసం తీసి అందులో దూదిని ముంచి రోజూ రెండు పూటలా కంటి భాగంలో తుడిస్తే ఆ ప్రాంతంలోని మృతకణాలు దూరమవుతాయి. చర్మం కాంతిమంతంగా మారుతుంది. 
  • బాదం పలుకులు కూడా సమస్యను తగ్గించేస్తాయి. వాటిని పాలలో నానబెట్టి మర్నాడు మెత్తగా చేసి నల్లగా మారిన చోట పూత వేసి  అరగంటయ్యాక కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
  • రెండు చెంచాల టమాటా రసంలో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి కళ్ల కింద నెమ్మదిగా రాయాలి.. కొద్దిసేపు అలా వదిలేసి దూదితో తుడిచి కడగాలి. 
  • అలాగే గులాబీ నీళ్లలో దూదిని ముంచి కళ్ల మీద పావుగంట ఉంచాలి. ఇలా చేస్తే అలసిన కళ్లకు హాయిగా ఉండటమే కాదు సమస్య దూరమవుతుంది.
  • నాలుగు మెంతి ఆకులను మెత్తగా రుబ్బి కళ్లకింద నల్లటివలయాల మీద పూతలా వేసి మర్దన చేస్తే ఆ ప్రాంతంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగి చర్మం మీద నలుపు పోతుంది. 
  • రెండు చెంచాల టమాటారసంలో తగినంత పసుపు, నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మిశ్రమంలా తయారు చేసి నల్లగా ఉన్న ప్రాంతంలో పూత వేయాలి. ఆరాక కడిగేస్తే సరిపోతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top