అలర్జీ... అంటువ్యాధి కాదు - హోమియో మందులు

అలర్జీ అనేది మారిన జీవనశైలికి ఒక సవాలుగా మారుతోంది. శరీరతత్వం, వాతావరణం, వంశపారంపర్య చరిత్ర, గాలి, నీరు, ఆహారంలో కలిగే మార్పులే దీనికి ప్రధాన కారణం. దేహంలోని వ్యాధినిరోధక శక్తి అసంబద్ధంగా స్పందించడమే అలర్జీ.

అలర్జీని కలిగించే పదార్థాన్ని ‘అలర్జెన్స్’ అంటారు. పూలలోని పుప్పొడి, ఫంగస్, యానిమల్ డాండర్, కొన్ని రకాల మందుల వాడకం, దుమ్ము-ధూళి సోకినప్పుడు అలర్జీ బారిన పడుతుంటారు. అలర్జీ కారకమైన అలర్జెన్ శరీరంలో ప్రవేశించినప్పుడు స్పెసిఫిక్ యాంటీబాడీస్ విడుదలై అలర్జెన్‌ను చుట్టేస్తుంది. అలర్జెన్ గాలిలో ఉంటే కళ్లు, ముక్కు దురద, ఊపిరితిత్తుల్లో బాధలు ఉంటాయి. జీర్ణాశయంలోకి చేరితే నోరు, కడుపు, పేగుల్లో బాధలను కలిగిస్తుంది.

తీవ్రతను బట్టి అలర్జీ మైల్డ్, మోడరేట్, సివియర్ అని మూడు దశలు.
మైల్డ్ అలర్జీ: 
అలర్జీ ఏ భాగానికి చెందినదైతే బాధలు కూడా ఆ భాగానికే పరిమితమవుతాయి. ఉదాహరణకు కంటి దురద, ఎరబ్రడటం, నీరుకారడం వంటివి.
మోడరేట్ అలర్జీ: 
అలర్జీ కలిగిన భాగంతో పాటు ఇతర భాగాలకు కూడా విస్తరిస్తుంది. దురదలు ఒళ్లంతా రావడం వంటివి.
సివియర్ అలర్జీ: 
ఈ దశలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. స్పృహకోల్పోవడం, కళ్లు, ఒళ్లంతా దురదలు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, వాపు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, తల తిరగడం,
బ్లడ్‌ప్రెషర్, నాడి వేగం తగ్గడం వంటివి. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. అయితే చాలా అరుదు. 
 అలర్జీ ఎవరిలో ఎక్కువ: 
తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు రావడానికి 75 శాతం అవకాశం ఉంటుంది. ఒక్కరికి మాత్రమే ఉన్నప్పుడు ఫిఫ్టీ- ఫిఫ్టీ చాన్సెస్ ఉంటాయి.

వ్యాధి లక్షణాలు... తుమ్ములు, ఆయాసం, శ్వాసలో ఇబ్బందులు, వాంతులు వంటివి ఉంటాయి. తీవ్రత పెరిగేకొద్దీ మరికొన్ని లక్షణాలు వస్తాయి.


హోమియోలో అలర్జీ ఏ కారణంగా వస్తోంది, దాని తీవ్రత ఏ విధంగా ఉంది అన్న విషయాలను నిశితంగా పరిశీలించి మందులను సూచిస్తారు. ప్రధానంగా ఆర్సినిక్ ఆల్బ్, ఆర్టికయురిన్స్, రస్టాక్స్, ఆరమ్‌డైపిలమ్, ఆలియంస్వె, ఇప్రెషియా, నేట్రమ్‌మూర్ వంటివి మంచి ఫలితాలనిస్తాయి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top