దంతాలకు క్లిప్స్ ఏ వయసులో వేయవచ్చు?


దంతాలు రావడంలో ఎగుడుదిగుడులు ఉంటే ఏడు- ఎనిమిది ఏళ్ల నుంచి ఏ వయసులోనైనా క్లిప్స్ వేయవచ్చు. అయితే చాలా మందిలో అంటే దాదాపుగా 90 శాతం కేసులలో 12-13 సంవత్సరాల నుంచి ట్రీట్‌మెంట్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. అలాగని అప్పటి వరకు డాక్టర్‌ను సంప్రదించకుండా ఉండడం సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే పిల్లలకు పాల పళ్లు పోయి శాశ్వత దంతాలు వచ్చేటప్పుడే ఒకసారి ఆర్థోడాంటిస్ట్‌ను సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది. ఆ దశలో పరీక్షించినప్పుడు దంతాలకు సంబంధించిన ఏదైనా ట్రీట్‌మెంట్ అవసరమవుతుందా? లేక దంతాలు, దవడల అమరిక సరిగ్గానే ఉండవచ్చా? అన్న విషయంలో ఒక అవగాహన ఏర్పడుతుంది.

ఆర్థోడాంటిస్ట్ అంటే దంత సంబంధించి పరిణతి చెందిన విభాగాల్లో ఒకటి. ఇందులో దంతాల అమరికను పరీక్షించి సమస్యలను ముందుగానే నిర్ధారించడం, అవసరమైన ముందుజాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని సందర్భాల్లో దంతాలు సరిగా రాకపోవడం వల్ల ముఖాకృతిలో లోపాలను సరిచేయడం ఈ విభాగంలోకి వస్తాయి.


బ్రేసెస్, క్లిప్స్, మరికొన్ని ఇతర పరికరాల సహాయంతో దంతాలను, ఎముక నిర్మాణాన్ని సరిచేసి పలువరుసను, ముఖాకృతిని ఆకర్షణీయంగా మార్చవచ్చు.
వైద్యుని సంప్రదించాల్సిన సందర్భాలు:
పాలపళ్లు చాలా త్వరగా ఊడిపోవడం లేక చాలా ఆలస్యం కావడం దంతాల అమరిక సరిలేనందున నమలడం, పదార్థాలను కొరకడం కష్టంగా ఉండడం దంతాలు ఒకదాని మీదకు ఒకటి ఎక్కినట్లురావడం, కొన్ని దంతాలు అసలే రాకపోవడం పన్ను చివరలు చెంపలను కొరుకుతున్నట్లు, నోటి పైభాగాన్ని గుచ్చుతున్నట్లు ఉండడం దవడలను అతికించినప్పుడు ఒకదానితో ఒకటి సరిగా అమరకపోవడం వేళ్లను నోట్లో పెట్టుకునే అలవాటు దంతాల సమస్యలకు దారి తీయవచ్చు పాలపళ్లలో కొన్ని మిగిలిన దంతాలకు సమానంగా పెరగకపోవడం పై దవడలోని ముందు పళ్లు కింద దవడలోని ముందు పళ్ల వరుసకంటే లోపలికి చొచ్చుకున్నట్లు రావడం పై దవడలోని ముందు పళ్లు కింద దవడలోని ముందు పళ్లను పాతికశాతం కంటే ఎక్కువగా కప్పివేసినట్లు రావడం ఏదైనా ఒక దంతాన్ని తీసివేసినప్పుడు దాని పక్కన ఉండాల్సిన పన్ను తొలగించిన దంతం స్థానానికి విస్తరించి వంకరగా వస్తుంటుంది. అలాంటప్పుడు... పై దవడ, కింది దవడల్లోని ముందు పళ్లు చక్కగా అమరినట్లు ఒక వరుసలో రాకుండా అపసవ్యంగా ఉన్నప్పుడు దంతాల వరుస అంటే చిగుళ్ల స్థానం సరిగా ఉన్నప్పటికీ చివరలు వంకర్లు తిరగడం దంతాల మధ్య ఎక్కువ సందులు ఉండడం ఒక దవడ చిన్నదిగానూ మరో దవడ పెద్దదిగానూ ఉండడం.



పై సమస్యల్లో ఏ ఒక్కటి లేదా అంతకంటే ఎక్కువ సమస్యలు కాని ఉన్నట్లయితే వెంటనే నిపుణుల సలహా, సూచనలు తీసుకోవాలి. తొలిదశలో గుర్తించినట్లయితే సులభంగా సరిచేయవచ్చు. భవిష్యత్తులో తలెత్తడానికి అవకాశం ఉన్న సమస్యలను నివారించవచ్చు. పిల్లల్లో దంతాల సమస్య ఉన్న చాలా మంది తల్లిదండ్రులు శాశ్వత దంతాలన్నీ వచ్చేవరకు వేచి చూస్తుంటారు. సాధారణంగా పిల్లలకు 12-13 ఏళ్లు వచ్చే వరకు డాక్టర్‌ను సంప్రదించకపోవడాన్ని గమనిస్తుంటాం. చిన్నప్పుడు చాలా సులువైన పద్ధతుల్లో దంతాలను సరిచేయడానికి అవకాశం ఉంటుంది. అదే 13 సంవత్సరాల దశలో సమస్యను పరిష్కరించడానికి కొన్ని కఠినమైన విధానాలు తప్పనిసరి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top