మూడ్ మార్చే 6 సూత్రాలు

న్యూ ఇయర్.. సండే గడిచిపోయాయి. వరుసగా రెండు రోజులు సెలవులు... ఇప్పుడు ఆఫీసుకి వెళ్లాలంటే... అబ్బ భలే బద్దకంగా ఉంది కదూ. సోమవారం కూడా సెలవుంటే బావుణ్ణు. కానీ నో వే. ఆఫీసుకి వెళ్లాల్సిందే. మరేం చేయాలి...?
  • ఉదయం లేవగానే బనానా షేక్‌లో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకోండి . ఉత్సాహం పెరిగి బద్దకం వదులుతుంది.
  • నీళ్లు బాగా తాగండి.
  •   రెండు రోజులుగా చేసిన సందడితో అలసిపోయారు కదా. మంచి సంగీతం వింటూ ఆఫీసుకి రెడీ అవండి. నీరసం తగ్గి ఉల్లాసం పెరుగుతుంది.
  • రెండు, మూడు చిన్న అల్లం ముక్కలు నోటిలో వేసుకుని నమలండి. అల్లం సిక్‌నెస్‌ను దూరం చేస్తుంది. అల్లం తినలేని వారు టీలో వేసుకుని తీసుకోవచ్చు.
  • ముఖ్యంగా ఆరోజు చేయాల్సిన పనుల్ని ఏ విధంగా ఎంజాయ్ చేయవచ్చో ఆలోచించండి. ఆఫీసుకి డుమ్మా కొట్టాలన్న ఆలోచన పోతుంది.
  • ఆఫీసు వర్క్‌లో కూడా రొటీన్‌నెస్ ఉండకుండా చూసుకోండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top