బిగ్‌బాస్‌-4 విజేత ఎవరు ?

పాపులర్‌ రియాల్టీ షో బిగ్‌ బాస్‌-4 విజేత ఎవరో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇందులో గెస్ట్‌గా హాలీవుడ్‌ తార పమేలా ఆండర్సన్‌ పాల్గొనడంతో ఇప్పటికే ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది ఈ రియాల్టీ షో. మూడు నెలలుగా కొనసాగుతున్న ఈ రియాల్టీ షో శనివారంతో ముగియనుంది.
 

బిగ్‌ బాస్‌ హౌస్‌లో గత మూడు నెలలుగా పార్టిసిపెంట్స్‌ ఉంటు న్నారు. వీరందరి మధ్య ఎంతో ఆసక్తికరమైన సన్నివేశాలు జరి గాయి. వీణా మాలిక్‌ నాటకాలు..డాలీ బింద్రా తమాషాలతో ఈ రియాల్టీ షో రసవత్తరంగా కొనసాగింది. ఇక చివరికి ఈ రియాల్టీ షోలో నలుగురు మాత్రమే మిగిలారు. అస్మిత్‌ పటేల్‌, శ్వేతా తివారి, డాలీ బింద్రా, ద గ్రేట్‌ ఖలీ ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఉన్నారు. ఈ నలుగురిలో చివరికి ఎవరు విజేతలుగా నిలుస్తారనేది శనివారం తేలనుంది. ఈ నేపథ్యంలో ఈ రియాల్టీ షోలో పాల్గొని తప్పుకున్న కొంతమంది ఏమంటున్నారో తెలుసుకుందామా...


సాక్షి ప్రదాన్‌ : 
బిగ్‌ బాస్‌-4 విజేతగా అస్మిత్‌ పటేల్‌ నిలుస్తాడని నా నమ్మకం. ఆయన చాలా మంచి వ్యక్తి. నా మద్దతు మొదటి నుంచి అస్మిత్‌కే ఉంది.

మనోజ్‌ తివారి:

నాకు తెలిసినంత వరకు శ్వేత తివారి చివరికి విజేతగా నిలుస్తుంది. చివరికి మిగిలిన నలుగురిలో శ్వేతానే అందరికంటే బెస్ట్‌ అని నా అభిప్రాయం. నా గురించి కొంత చెడుగా మాట్లాడినా నేను మాత్రం ఆమె గెలువాలని కోరుకుంటున్నాను.

ఆంచల్‌ కుమార్‌ :

ఖలీ, అస్మిత్‌లు ఇద్దరు బాగా కొనసాగుతున్నారు. కానీ ఈ ఇద్దరిలో అస్మితే బెస్ట్‌. ఇక శ్వేతానే చివరికి విజేతగా నిలుస్తుందని నా నమ్మకం.

రాహుల్‌ భట్:

నా అభిప్రాయం ప్రకారం శ్వేతా తివారీనే గెలుస్తుంది. ఆమె చక్కటి వినోదాన్ని పంచుతోంది. టివి ప్రేక్షకుల మద్దతు కూడా ఆమెకు ఉంది.డాలీ బింద్రా ఇబ్బంది పెట్టడం వంటి విషయాలు శ్వేతాకు ప్లస్‌ పాయింట్స్‌గా మారాయి.
 

సీమా పరిహార్‌:
శ్వేతా, అస్మిత్‌లు ఇద్దరూ మొదటి నుంచి గట్టి పోటీదారులుగా ఉన్నారు. కానీ నా మద్దతు శ్వేతాకే.

హృషాంత్‌ గోస్వామిః

విజేతగా ఎవరు నిలుస్తారో చెప్పలేను. కానీ అస్మిత్‌ మొద టి నుంచి ఎంతో ఫెయిర్‌గా ఉన్నాడు. ఈ షోలో మేమిద్దరం కలిసి ఉన్నాము. చివరికి అదృష్టంతో పాటు ప్రేక్షకుల ఓట్లే విజేతను నిర్ణయిస్తాయి.

బేగమ్‌ నవాజిష్‌ అలీః 

నాకైతే శ్వేతానే గెలుస్తుందని అనిపిస్తోంది. ఈ షోలో చివరికి మిగిలిన వారికంటే ఆమె గట్టి పోటీదారురాలిగా ఉంది.

అబ్బాస్‌ కజ్మీ: 

శ్వేతా, అస్మిత్‌లలో ఎవరో ఒకరే విజేతలుగా నిలుస్తారు. దీంట్లో తిరుగులేదు.

వీణా మాలిక్‌: 

బిగ్‌బాస్‌-4లో ఎవరు విజేతలుగా నిలుస్తారో చెప్పలేను.

సమీర్‌ సోనిః:

చివరి వరకు శ్వేతా గట్టిపోటీదారుగా నిలిచింది. చివరికి ఆమె విజేతగా నిలుస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top