చర్మ వ్యాధి నివారణా తైలాలు


చర్మ వ్యాధులను ఉపశమింపచేయడానికి గానీ, పూర్తిగానివారించడానికి గానీ ఆయుర్వేదంలో రెండు రకాల తైలాలు అందుబాటులోఉన్నాయి.వాటిలో కొన్ని ఔషధ గింజల నుంచి తీసిన తైలాన్ని చర్మం పైన లేపనంగా గానీ, మర్ధన కోసం గానీ వాడేవి మొదటి రకం. వీటిని ఏకమూలికా తైలాలు అంటారు. ఇవి ఉపశమానికి ఉపయోగపడతాయి. 

ఇక చర్మ వ్యాధులను నివారించేందుకు వాడేవి రెండవ రకం. కొన్ని రకాల వనమూలికల బెరడు, ఆకులు, గింజలు, పళ్ల తొక్కలు, పూరేకులు ముద్దగా దంచి పెట్టుకుని వీటికి తగిన నిష్పత్తిలో నువ్వుల నూనె లేక ఆముదం నూనె, కొబ్బరి నూనె తగిన నిష్పత్తిలో తీసుకుని మంచి నీళ్లు గానీ లేక అదే మూలికల కషాయాన్ని గానీ కలిపి అన్నీ ఓ పాత్రలోకి చేర్చి నిపుణులైన ఆయుర్వేద వైద్యులు, ఫార్మాసిస్టులు తయారు చేసేవి. వీటికి Äౌగిక తైలాలు అని పేరు. వైద్యుడు ఆయా మూలికల గుణగణాల ఆధారంగా ఫార్ములా ఆయిల్స్ తయారు చేస్తాడు. ఆధునికంగా మరో రెండు తైలాలు కూడా వాడుకలోకి వచ్చాయి.

వాటిలో ఇగిరే ధర్మం క లిగిన సుగంధ తైలాలు (ఎస్సెన్స్ ఆయిల్స్/ ఓలటైల్ ఆయిల్స్) 'అర్కం' (డిస్టిలేషన్ మెథడ్)లో తయారు చేస్తారు. ఇలా మూలికల నుంచే కాకుండా 'ఇము' పక్షులు, కార్డ్ చేపల నుంచి కూడా తైలాలను తయారు చేస్తారు. చర్మ వ్యాధులకు ఉపయోగించే తైలాలన్నీ దాదాపు చర్మం పైన పూత లేదా మర్ధన రూపంలోనే ఉపయోగించాలి. ఇలా ఔషధ గుణాలను చర్మం ద్వారా శరీరంలోకి చొప్పించడం ద్వారా, చర్మ సమస్యను శుభ్రపర్చడం, మాన్పడం సాధ్యమవుతుంది.
 

మర్ధనతో తైలం ర క్తాన్ని చేరి రక్త శుద్ధి లేదా చర్మవ్యాధికి కారణమైన రక్తంలోని సూక్ష్మ క్రిములను కూడా చంపేస్తుంది. వీటితో పాటు రక్తశుద్ధిని చేసే ఇతర ఔషధాలను కడుపులోకి తీసుకోవడం ద్వారా ఈ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది ఫలితంగా చర్మ వ్యా«ధులు సమూలంగా తొలగిపోయే అవకాశం ఉంది. అన్ని రకాల చర్మవ్యాధులకు ఆయుర్వేదం రక్తదోషాన్నే కారణంగా భావిస్తుంది. అందుకే రక్తశుద్ధి చికిత్సలకు ఆయుర్వేదం ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది.

ఏకమూలికా తైలాలు
ఆముదం నూనె : 

ఆముదం నూనెలో ఉండే 'అన్‌డిసైలెనిక్ యాసిడ్' రసాయనం చర్మ వ్యాధులపైన పనిచేస్తుంది. ఇందులో ఉండే ఐసోస్టియరిక్ యాసిడ్, సక్సినిక్ యాసిడ్‌లు స్కిన్ కండిషనింగ్‌కు ఉపయోగపడతాయి. ఈ నూనెలో ఉండే రిసోనిక్ యాసిడ్ చర్మవ్యాధుల్లో వచ్చే వాపును అరికడుతుంది. ఇప్పుడు వస్తున్న స్కిన్ ఆయింట్‌మెంట్లలో ఆముదపు నూనెను వినియోగించడానికి ఇదే కారణం.

సాంప్రదాయక గృహవైద్యంలో కూడా ఆముదం వినియోగం ఎక్కువగానే కనిపిస్తుంది. పొడిబారిన చర్మంపైన తేమ నిలవడానికి, వెంట్రుకలు ఏపుగా ఎదగడానికి, నల్లబడటానికి కూడా ఆముదపు నూనెను వాడతారు. క నురెప్పల మీద వచ్చే కురుపులు తగ్గడానికి ఆముదపు చుక్కలు కంట్లో వేయడం గానీ, ఆముదపు దీపంతో ఏర్పడే మసిని కాటుకగా వాడటం కూడా చాలా మందికి అలవాటుగా ఉంది. అలాగే చర్మం పైన ఏర్పడే కురుపులు లేదా పుండ్లకు పూతలా రాయడం కూడా చూస్తూ ఉంటాం. ఈ చికిత్సలన్నీ ఎంతో ఫలితాన్నిస్తాయి
 

క లౌంజీ నూనె: 
కలౌంజీ గింజలను బ్లాక్‌సీడ్స్ లేదా కార్‌వే సీడ్స్ అంటారు. ఈ నూనెతో తలపై రోజూ మర్ధన చేయడం ద్వారా జుట్టు రాలిపోవడం చాలా వరకు ఆగిపోతుంది. అలాగే ఈ నూనెకు తగినంత వెనెగార్ కలిపి మొటిమల మీద పూస్తే తగ్గే అవకాశం ఉంది. పై సమస్యల్లో ఈ నూనెను అరచెంచా చొప్పున కొంచెం తేనెతో కలిపి కడుపులోకి తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. చర్మక్యాన్సర్‌లో కూడా ఈ నూనెతో ఫలితం కనిపిస్తుంది.

నువ్వుల నూనె:

ఈ నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ కారణంగా మెలనిన్ వర్ణ రసాయనాల కారణంగా నెరసిన జుట్టు నల్లబడుతుంది. జుట్టు రాలకుండా ఆగిపోతుంది. ఈ నూనెలో విటమిన్ 'ఇ', మెగ్నీషియం, కాపర్ ఐరన్, జింక్ కూడా ఉండడం వల్ల చర్మ రక్షణకు ఈ నూనెతో చేసిన మర్ధన ఎంతో ఉపయోగపడుతుంది.

ఆలివ్ నూనె: 

పొడిబారే చర్మానికి మాయిశ్చరైజర్‌గా ఎంతో ప్రసిద్ధమైన తైలమిది. ఫేషియల్స్‌కి గానీ, బాడీ పాలిషింగ్‌లో గానీ ఆయిల్ క్లెన్సర్‌గా ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్-ఇ సమృద్ధిగా ఉండడం వల్ల చర్మ రక్షణకు బాగా తోడ్పడుతుంది. చర్మ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడే ధర్మం కూడా ఈ నూనెలో ఉంది.


చాల్మోగ్రా నూనె: 
ఈ నూనెకు 'తువరక తైలం' అనే పేరు కూడా ఉంది. చర్మ వ్యాధులకు ఇది గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కుష్టువ్యాధిలో వచ్చే వ్రణాలకు డ్రెస్సింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సిఫిలిస్, గనేరియా సంబంధిత పుండ్లను కూడా ఈ నూనె బాగా తగ్గిస్తుంది. ఇవే కాకుండా రింగ్‌వార్మ్, ఎగ్జిమా, స్కైబీస్ వంటి చర్మ వ్యాధుల నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ప్రసవానంతరం జననాంగం నుండి దుర్గంధం వచ్చే సందర్భాల్లో ఈ తైలంలో ముంచిన స్టెరైల్ టాంఫూన్‌ను ఉపయోగించవచ్చు. దీర్ఘకాలిక చర్మవ్యాధులన్నిటిలోనూ ఈ తైలాన్ని వైద్య పర్యవేక్షణలో కడుపులోకి కూడా తీసుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top