కాఫీ ఎక్కువైతే ముప్పే?


కొంచెం రిలీఫ్ కోసమంటూ కాఫీని పరిమితికి మించి తాగేస్తున్నారా? అయితే మీరు ఓసారి ఆలోచించుకోవాల్సిందే.. ఇటువంటివారు స్ట్రోక్ బారిన పడే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజులో ఒకటి లేదా రెండు కప్పులకు పరిమితమయ్యేవారు అదనంగా ఒకటి రెండు కప్పులు పుచ్చుకుంటే మెదడులో రక్తం గడ్డకట్టి పక్షవాతం బారిన పడుతున్నట్లు హర్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు గుర్తించారు.

కాఫీని అధికంగా లాగించేవారు గంట నుంచి రెండు గంటల్లో పక్షవాతం ముప్పును ఎదుర్కొంటున్నారని వీరు వెల్లడిస్తున్నారు. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల రక్తపోటు పెరిగిపోవడం, ధమనులు మూసుకుపోవడం, ఒత్తిడికి గురిచేసే హార్మోన్ నార్‌ఫినెప్రిన్ స్థాయి పెరిగిపోవడం జరుగుతుంది.

దీనివల్ల స్ట్రోక్ గురయ్యే ప్రమాదం ఎక్కువవుతుంది. ఈ దుష్ఫలితాలను కాఫీ ప్రియులు గుర్తించలేకపోవడం, తెలుసుకోలేకపోవడమే సమస్యకు కారణమంటున్నారు పరిశోధకులు. 400 మంది పక్షవాత బాధితులను పరిశీలించి మరీ వారీ ఫలితాలను వెల్లడించారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top