టాన్సిల్స్‌కు సర్జరీ ఎందుకు...?


ప్రకృతిలోని ప్రతి పదార్థానికీ ఒక లక్ష్యం ఉన్నట్లే శరీరంలోని ప్రతి అవయవానికీ ఒక ప్రయోజనం ఉంది. శరీరంలోకి సూక్ష్మక్రిములు వెళ్లకుండా కాపాడే రక్షక భటులే ఈ టాన్సిల్స్. ఆహార పదార్థాలు, వాతావరణంలోని కాలుష్యం, విషపదార్థాలు, సూక్ష్మక్రిములు నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తే పలురకాల వ్యాధులు తలెత్తుతాయి. ఒక్కోసారి ప్రాణాపాయమూ ఏర్పడవచ్చు. వీటిని నిరోధించడంలో టాన్సిల్స్ ఎంతో కీలక భూమిక నిర్వహిస్తాయి.

వాతారణ కాలుష్యం పెరిగిపోవడంతో పాటు , ఐస్‌క్రీములు, కూల్‌డ్రింకుల వినియోగం ఎక్కువైపోయింది. ఈ కారణంగా పిల్లల్లో టాన్సిల్ సమస్యలు పెరిగిపోతున్నాయి. కొంతకాలం మందులేవో వాడి తగ్గకపోయే సరికి చాలా మంది శస్త్రచికిత్సతో టాన్సిల్స్ తీయించుకోవడానికి సిద్ధమవుతున్నారు. కానీ, సూక్ష్మక్రిముల బారినుండి శరీరాన్ని కాపాడే రక్షక భటుల్లాంటి ఈ టాన్సిల్స్‌ను తొలగించడం అంటే అది శరీరం రోగగ్రస్తం కావడానికి ద్వారాలు తీయడమే అవుతుందని అంటున్నారు నిపుణులు. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే... ప్రకృతిలోని ప్రతి పదార్థానికీ ఒక లక్ష్యం ఉన్నట్లే శరీరంలోని ప్రతి అవయవానికీ ఒక ప్రయోజనం ఉంది. శరీరంలోకి సూక్ష్మక్రిములు వెళ్లకుండా కాపాడే రక్షక భటులే ఈ టాన్సిల్స్.

ఆహార పదార్థాలు, వాతావరణంలోని కాలుష్యం, విషపదార్థాలూ, సూక్ష్మక్రిములు నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తే పలురకాల వ్యాధులు తలెత్తుతాయి. ఒక్కోసారి ప్రాణాపాయమూ ఏర్పడవచ్చు. వీటిని నిరోధించడంలో టాన్సిల్స్ ఎంతో కీలక భూమిక నిర్వహిస్తాయి. అయితే ఈ కల్మషాలూ, సూక్ష్మ క్రిములను నిరంతరం అడ్డుకునే క్రమంలో ఒక్కోసారి టాన్సిల్స్ కూడా రోగగ్రస్తమవుతాయి. ఆ స్థితిలో టాన్సిల్స్‌లో వాపు, నొప్పి తలెత్తుతాయి. ఈ సమస్యలు ఎక్కువైనప్పుడు జ్వరం కూడా రావచ్చు. 


అక్యూట్, క్రానిక్ సమస్యలు
టాన్సిల్ సమస్యలు కొన్ని తాత్కాలికంగానూ (అక్యూట్), కొన్ని తీవ్రంగానూ (క్రానిక్) ఉంటాయి. ఐస్‌క్రీములు, కూల్‌డ్రింకులు వంటి అతిచల్లని ఆహార పానీయాలు తీసుకున్నప్పుడు కూడా ఈ సమస్య రావచ్చు. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కూడా కొన్నిసార్లు ఈ సమస్య తలెత్తవచ్చు. ఈ స్థితిలో ఒకటి రెండు రోజులు మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. కొందరికి మందులేవీ వేసుకోకపోయినా దానికదే తగ్గిపోతుంది. టాన్సిల్స్ సమస్యకు ఎక్కువగా పదేళ్ల లోపు పిల్లలే లోనవుతూ ఉంటారు. ఆహార పానీయాలు, పరిశుభ్రత గురించి వారికి తెలియకపోవడం ఒక కారణమైతే దుమ్ము ఇతర కాలుష్యాల మధ్య ఆడుకోవడం మరో కారణం.

టాన్సిల్స్ పెద్దవైపోతే...
అయితే టాన్సిల్ సమస్య తీవ్రదశకు చేరుకున్నప్పుడు వాపు, నొప్పి, తరుచూ వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు ఒక్కోసారి నెలా రెండు నెలలదాకా ఎడతెగకుండా వేధించవచ్చు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరంతో పిల్లలు సరిగా ఆహారం కూడా తీసుకోలేరు. అదే పనిగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఆకలి కూడా తగ్గిపోతుంది. ఫలితంగా శరీరానికి అవసరమైన పోషకాలేవీ అందవు.
 

ఇది వారి ఎదుగుదల కుంటుపడేలా చేస్తుంది. టాన్సిల్స్ సమస్య మొదలైన తొలిరోజుల్లో టాన్సిల్స్‌లో వాపు వచ్చి తగ్గిపోతుంది. కానీ, సమస్య తీవ్రమై తరుచూ రావడం మొదలయ్యాక టాన్సిల్స్ పెద్దవవుతాయి. ఈ స్థితిని హైపర్ ట్రోఫియా అంటారు. కొందరిలో వాపు రాకుండానే , ఎర్రబారడం గానీ, నొప్పిగానీ లేకుండానే టాన్సిల్స్ పెద్దవవుతాయి.

టాన్సిల్ సమస్యకు సరియైన చికిత్స లభించకపోతే గొంతులోని ఇన్‌ఫెక్షన్లు చెవిలోకి వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల వినికిడి శక్తి తగ్గడంతో పాటు చెవిలో నొప్పి కూడా రావచ్చు. అరుదుగా కొందరిలో చెవి వెనుక ఉంటే నాస్టాయిడ్ ఎముక కూడా దెబ్బ తింటుంది. ఈ భాగంలోకి వెళ్లిన ఇన్ ఫెక్షన్లు ఒక్కోసారి మెదడుడోకి కూడా వెళ్లవచ్చు ఇది మరీ ప్రమాదం.

అయితే గొంతు నొప్పి ఉన్న అందరికీ టాన్సిల్ సమస్యే అనుకోవడానికి లేదు. డిఫ్తీరియా వ్యాధి సోకినప్పుడు కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. అందుకే టాన్సిల్స్ సమస్య అంటూ వచ్చిన వారికి వైద్యులు డిఫ్తీరియా ఉందేమోనని పరీక్షిస్తారు. బ్యాక్టీరియాతో వచ్చే ఈ వ్యాధితో ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చు. ఉన్నది టాన్సిల్స్ సమస్యేనని నిర్ధారణ అయ్యాకే చికిత్స తీసుకోవాలి.
 

శస్త్రచికిత్స లేకుండానే
టాన్సిల్స్ సమస్యకు చాలా మంది శస్త్ర చికిత్స ద్వారా వాటిని తీసివేయడమే పరిష్కారంగా భావిస్తారు. టాన్సిల్స్ శరీరంలోని ఒక అనవసరమైన భాగాలన్న భావనే ఇందుకు కారణం. టాన్సిల్స్‌ను శస్త్ర చికిత్సతో తీసివేయడం అంటే అది సూక్ష్మక్రిములను శరీరంలోకి ఆహ్వానించడమే అవుతుంది. చిన్న వయసులోనే టాన్సిల్స్ తొలగించబడిన పిల్లలు తరుచూ గొంతు సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

నిరంతరం వారిని పొడిదగ్గు వేధిస్తూ ఉంటుంది. వీరు ఏకాస్త చల్లని నీరు తాగినా, వాతావరణంలో ఏ కాస్త మార్పు వచ్చినా దగ్గు జ్వరం వంటి సమస్యలు మొదలవుతాయి. టాన్సిల్స్‌ను తొలగించడం వల్ల శరీరం ఏ వ్యాధికైనా చాలా త్వరగా గురయ్యే స్థితి ఏర్పడుతుంది. వాతావరణంలో వచ్చే ప్రతి చిన్న మార్పుతోనూ వీరికి గొంతు నొప్పితోపాటు గొంతులో దురద దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. మాట సరిగా రాదు. గొంతు బొంగురుపోతుంది. క్రమంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి శరీరం తన సహజ ఆరోగ్య స్థితిని కోల్పోతుంది.

టాన్సిల్స్ సూక్ష్మక్రిములను, కాలుష్యాలను కడుపులోకి వెళ్లకుండా నిరోధించడానికి ఉద్దేశించినవే. కానీ వాటికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. తీవ్రమైన విషపదార్థాలు తీసుకుంటే వాటిని అవి ఆపలేవు. ఆ స్థితిలోనే అవి రోగగ్రస్తమవుతాయి.  



ఏం చేయాలి ?
శస్త్ర చికిత్సతో టాన్సిల్స్‌ను తొలగించే అవసరం లేకుండానే వ్యాధిని నయం చేసే మందులు హోమియోలో ఉన్నాయి. టాన్సిల్స్ పూర్తిగా పాడైపోయిన ఏవో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప 99 శాతం టాన్సిల్స్ సమస్యలు మందులతోనే తగ్గిపోతాయి. దీర్ఘకాలికంగా ఉండి టాన్సిల్స్ మరీ పెద్దవైపోయిన హైపర్‌ట్రోఫియా సమస్యలో నయం కావడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది.

సమస్య తీవ్రతను అనుసరించి కొందరికి ఏడాది నుంచి రెండేళ్ల దాకా పట్టవచ్చు. చికిత్స తీసుకోవడం మధ్యలో మానేస్తే సమస్య మళ్లీ మొదటికొస్తుంది. సమస్య మొదలైన తొలిదశలోనే హోమియో చికిత్స తీసుకుంటే మూడు మాసాల్లోనే పూర్తిగా తొలగిపోతుంది.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top